Samantha: స్వీటెస్ట్ ఎవర్.. బాలీవుడ్ స్టార్ హీరోతో సమంత షూటింగ్.. సెల్ఫీ పోస్ట్ చేసిన హీరోయిన్..

|

Jun 06, 2022 | 5:41 PM

ఇప్పటికే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రాన్ని పూర్తిచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha: స్వీటెస్ట్ ఎవర్.. బాలీవుడ్ స్టార్ హీరోతో సమంత షూటింగ్.. సెల్ఫీ పోస్ట్ చేసిన హీరోయిన్..
Samantha
Follow us on

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత (Samantha) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. విడాకుల తర్వాత కెరీర్ పరంగా దూకుడు పెంచింది సామ్. వచ్చిన ప్రతి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ.. అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ఇప్పటికే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రాన్ని పూర్తిచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు.. సామ్ ప్రస్తుతం యశోధ, ఖుషి సినిమా చిత్రీకరణలో పాల్గోంటూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్ నుంచి వరుస ఆఫర్లను అందుకుంటుంది సామ్. తాజాగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‏తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసుకుంది సామ్.

ఇటీవల వీరిద్దరు ముంబైలో ఓ అడ్వర్టైజ్మెంట్ షూట్ కోసం కలిసినట్లుగా తెలుస్తోంది. అందులో సామ్ పోలీసు అధికారికగా కనిపిస్తోంది. రణవీర్ సింగ్‏తో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ .. స్వీటేస్ట్ ఎవర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది సామ్. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ తో సమంత పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజీ పాత్రలో నటించిన సామ్.. తన నటనతో సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం సమంత తెలుగు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలలో వరుస చిత్రాల్లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

Samantha