
గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసింది సమంత. ఎక్కువగా వెబ్ సిరీస్ లపైనే ఆసక్తి చూపిస్తోంది. గతేడాది సామ్ నటించిన సిటాటెడ్ హనీ బన్నీ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లోనూ సామ్ నటిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే బిజినెస్ లోనూ జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది సామ్. సాకీ పేరుతో బ్రాండెడ్ దుస్తుల వ్యాపారం అలాగే ఏకం లెర్నింగ్ స్కూల్ అంటూ బిజి బిజీగా ఉంటోంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను తోటి నటీనటులకు పంపిస్తుంటారు. విజయ్ దేవరకొండ, నయన తార తదితర సెలబ్రిటీలు కూడా తమ బిజినెస్ ప్రొడక్ట్స్ ను ఇతర హీరోలు, హీరోయిన్లకు చేస్తుంటారు. దీని వల్ల ఆయా సెలబ్రిటీల బిజినెస్ ప్రొడక్ట్స్ కు కావాల్సిన ప్రమోషన్ కూడా లభిస్తుంటుంది. అలా తాజాగా సమంత తన సాకీ బ్రాండ్ దుస్తులను రష్మికకి పంపించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది నేషనల్ క్రష్. తనకు బ్రాండెడ్ దుస్తులు పంపిన సమంతకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది.
ప్రస్తుతం రష్మిక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఛావాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉంటోంది. ఇది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సల్మాన్ ఖాన్ తో సికిందర్ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ నటిస్తోందీ అందాల తార.
Samantha Gifts To Rashmika
I wishhhhh life could always feel like these images 🩷🩷🩷 just happy, bright, playful and funnnnn… you agree no? pic.twitter.com/P2PnPs2XXe
— Rashmika Mandanna (@iamRashmika) February 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి