
ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే కాను పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించింది. అంతే కాదు హిందీలోనూ నటించి తన సత్తా చాటింది. సినిమాల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. సమంత ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యల కారణంగా సామ్ సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీకానుంది. ఇప్పుడు సమంత ప్రొడ్యూసర్ గాను మారింది. రీసెంట్ గా శుభం అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ ను సమంత ఎంజాయ్ చేస్తుంది. అలాగే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటూ బిజీ బిజీగా మారిపోయింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన తండ్రి చనిపోయిన సమయంలోనూ నవ్వుతూ ఫోటోలు దిగాను అని తెలిపింది సమంత. 2024 నవంబర్ 29న సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. తాజాగా సమంత మాట్లాడుతూ.. అభిమానులు నా దగ్గరకు ఫోటోల కోసం వచ్చినప్పుడు నేను నో చెప్పలేదు. చెన్నైలో తన తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనూ అభిమానులు తనతో ఫోటోలు దిగడానికి వచ్చారని తెలిపింది. అంత బాధలోనూ అభిమానులతో నవ్వుతూ ఫొటోలో దిగాను అని తెలిపింది. ఎందుకంటే అభిమానులు వల్లే తాను ఇంత ఎత్తుకు ఎదిగాను. నా విజయానికి కారణం తన అభిమానులే. మనం ఎలాంటి బాధలో ఉన్నామో వారికి తెలియకపోవచ్చు.. కానీ నాతో ఫోటోలు దిగడానికి వచ్చిన అభిమానులకు నో చెప్పలేదు అని సమంత తెలిపింది. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.