AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: అలా చేస్తానని అసలు ఊహించలేదు.. కానీ ఇప్పుడు గర్వపడుతున్నాను.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మానసిక సంఘర్షణ.. మయోసైటిస్ సమస్యలతో పోరాడుతూ తిరిగి వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తుంది. కొన్నాళ్ల క్రితం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న సామ్.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడు తిరిగి సినిమాలకు సంబంధంచిన వేడుకలలో పాల్గొంటుంది. ఇటీవల ఇండియా టూడే కాన్ క్లేవ్ 2024కు హాజరయిన సామ్.. తన కెరీర్ లో చేసిన అత్యంత కష్టతరమైన పాత్ర గురించి చెబుతూ.. ఆ విషయంలో ఇప్పటికీ గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది.

Samantha: అలా చేస్తానని అసలు ఊహించలేదు.. కానీ ఇప్పుడు గర్వపడుతున్నాను.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Samantha
Rajitha Chanti
| Edited By: |

Updated on: Mar 18, 2024 | 12:44 PM

Share

భారతీయ సినీ పరిశ్రమలో దాదాపు 14 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలుగుతున్న కథానాయిక సమంత. ఏమాయ చేసావే అంటూ తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న తార. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ వ్యక్తిగత జీవితంలో ఎదురైన సంఘటనలతో ఆమె లైఫ్ మలుపులు తిరిగింది. వరుస అవకాశాలతో నంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోయిన ఆమె.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. మానసిక సంఘర్షణ.. మయోసైటిస్ సమస్యలతో పోరాడుతూ తిరిగి వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తుంది. కొన్నాళ్ల క్రితం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న సామ్.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడు తిరిగి సినిమాలకు సంబంధంచిన వేడుకలలో పాల్గొంటుంది. ఇటీవల ఇండియా టూడే కాన్ క్లేవ్ 2024కు హాజరయిన సామ్.. తన కెరీర్ లో చేసిన అత్యంత కష్టతరమైన పాత్ర గురించి చెబుతూ.. ఆ విషయంలో ఇప్పటికీ గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది.

ఇటీవల ఇంటర్వ్యూలో సిటాడెల్ చిత్రీకరణ అత్యంత తీవ్రమైన పరిస్థితులలో జరిగిందని.. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను శారీరకంగా బలహీనంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ” సిటాడెల్ సినిమాలో నేను పోషించిన పాత్రలో నా జీవితంలోనే అత్యంత కష్టతరమైన పాత్ర. ఎందుకుంటే ఆ సిరీస్ షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను బలహీనంగా ఉన్నాను.. అందుకే నాకు సిటాడెల్ సిరీస్ ఇప్పటికే సక్సెస్ అయ్యిందని భావిస్తున్నాను. ఎందుకంటే కష్టమైన పరిస్థితులలో ఆ సిరీస్ కంప్లీ్ట్ చేశాను. నేను ఆ సిరీస్ పూర్తి చేస్తానని అసలు అనుకోలేదు. మళ్లీ దాని గురించి అడుగుతుంటే.. ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను అని మాత్రం చెప్పగలను” అంటూ చెప్పుకొచ్చింది.

సిటాడెల్ చిత్రీకరణ సమయంలోనే తనకు మయోసైటిస్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని.. ఆ తర్వాత ఖుషి చిత్రంలోనూ నటించినట్లు తెలిపింది. ఖుషి సినిమాలో మయోసైటిస్ సమస్య మరింత ఇబ్బంది పెట్టడంతో నటన నుంచి కొంతకాలం పాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది. సిటాడెల్ సిరీస్ కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవలే ఈ సిరీస్ డబ్బింగ్ పనులు పూర్తి చేసింది. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.