Samantha: విరాట్ కోహ్లీ కమ్ బ్యాక్ సెంచరీ.. కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. వీడియో వైరల్..

| Edited By: seoteam.veegam

May 18, 2023 | 6:49 PM

కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. సెప్టెంబర్ 1న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఐపీఎల్ లో తనకు ఇష్టమైన టీంతోపాటు.. తన ఫేవరేట్ క్రికెటర్ గురించి కూడా చెప్పేసింది.

Samantha: విరాట్ కోహ్లీ కమ్ బ్యాక్ సెంచరీ.. కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. వీడియో వైరల్..
Samantha, Kohli
Follow us on

సమంత ప్రస్తుతం ఖుషి చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదైలన పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఇటీవల రిలీజ్ అయిన నా రోజా నువ్వే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. సెప్టెంబర్ 1న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఐపీఎల్ లో తనకు ఇష్టమైన టీంతోపాటు.. తన ఫేవరేట్ క్రికెటర్ గురించి కూడా చెప్పేసింది సామ్.

తనకు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అంటే ఇష్టమని తెలిపింది. అలాగే తనకు ఎంఎస్ ధోని ఫేవరేట్ క్రికెటర్ అని.. కానీ పలు విషయాల్లో విరాట్ కోహ్లీని స్పూర్తిగా తీసుకుంటానని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ తన కమ్ బ్యాక్ సెంచరీ చేసినట్లు తాను ఏడ్చేశానని తెలిపింది. ఫామ్ కోల్పోయి.. ముప్పేట దాడిని ఎదుర్కొన్న కోహ్లి.. తిరిగి పుంజుకున్న తీరు అమోఘమని.. ఇది నిజంగా స్పూర్తిదాయకమని అన్నారు. ఇవే కాకుండా.. క్రికెట్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలను సామ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఓవైపు ఖుషి చిత్రంలోనే కాకుండా.. మరోవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ నటిస్తుండగా.. ఫ్యామిలీ మేన్ సిరీస్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.