Samantha Ruth Prabhu: గేమ్ షోలో పెద్దమొత్తంలో గెలుచుకున్న సమంత.. ఆ డబ్బును ఏం చేసిందో తెలుసా..

మేమిద్దరం విడిపోయాం అని ప్రకటించుకున్న తర్వాత... కొద్దికొద్దిగా నార్మల్‌ సిట్యువేషన్‌లోకి వచ్చేస్తున్నారు నాగచైతన్య అండ్ సమంత.

Samantha Ruth Prabhu: గేమ్ షోలో పెద్దమొత్తంలో గెలుచుకున్న సమంత.. ఆ డబ్బును ఏం చేసిందో తెలుసా..
Saam

Updated on: Oct 07, 2021 | 7:29 PM

Samantha Ruth Prabhu: మేమిద్దరం విడిపోయాం అని ప్రకటించుకున్న తర్వాత… కొద్దికొద్దిగా నార్మల్‌ సిట్యువేషన్‌లోకి వచ్చేస్తున్నారు నాగచైతన్య అండ్ సమంత. చై తన సినిమా షూటింగ్స్‌తోను, ప్రమోషన్స్‌తోనూ బిజీగా కనిపిస్తున్నారు. ఈ శుక్రవారం జరగనున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో చీఫ్‌గెస్ట్‌గా కనిపించబోతున్నారు చైతన్య. అటు సమంత కూడా.. అయ్యామ్ ఆల్సో బిజీ అనే హింట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్స్ ను కంటిన్యూ చేస్తున్న సామ్.. తాజాగా ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌లో సెలబ్‌ కోటాలో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేశారు సమంత. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌ చేస్తున్న ఈ షోలో హాట్‌సీట్‌లో కూర్చుని పెద్ద మొత్తంలో ప్రైజ్‌ మనీ గెలుచుకున్నారు సమంత.

ఈ మొత్తాన్ని చారిటీకిచ్చేశారట. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సామ్ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అయ్యేదీ గోప్యంగా వుంచారు. అయితే ఈ నెల ఆఖరున ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఇక ఎన్టీయార్‌తో కలిసి వెండితెరపై హీరోయిన్‌గా నాలుగు సినిమాల్లో నటించిన సమంత… ఆ పరిచయంతో బుల్లితెరపై కూడా మంచి కెమిస్ట్రీ పండించారని తెలుస్తోంది. ఇప్పటివరకూ చరణ్‌, రాజమౌళి-కొరటాలను హాట్‌సీట్లో పరిచయం చేశారు తారక్. మహేష్‌బాబు, ప్రభాస్‌లతో సెలబ్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు సమంత ఎంట్రీతో మరింత పాపులర్ కాబోతోంది ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ఇక తారక్‌తో సమంత చేసిన సందడి ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Samantha

మరిన్ని ఇక్కడ చదవండి :

Vaishnav Tej : ఆ స్టార్ హీరోల కథలను ఎంచుకోవలని ఉంది.. మనసులో మాట చెప్పిన వైష్ణవ్ తేజ్..

Bigg Boss 5 Telugu: రవి- షణ్ముఖ్ మధ్య మంటలు.. కెప్టెన్ అయ్యి చూపిస్తానంటున్న శ్రీరామ్..

Taapsee Pannu: టాలీవుడ్ టూ బాలీవుడ్ అదరగొట్టిన తాప్సీ.. సోషల్ మీడియాలో ఫొటోస్..