Samantha Ruth Prabhu: నేను ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలనూ చూశా.. ఎమోషనల్ అయిన సమంత

|

Apr 02, 2023 | 3:16 PM

రీసెంట్ గా యశోద సినిమాతో హిట్ అందుకుంది. అలాగే ఇప్పుడు శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు.

Samantha Ruth Prabhu: నేను ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలనూ చూశా.. ఎమోషనల్ అయిన సమంత
Samantha
Follow us on

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత ఎమోషనల్ పోస్ట్ లు షేర్ చేస్తూ.. తన జర్నీని.. తాను ఎదుర్కున్న సమస్యలగురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ వస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వస్తోన్న సామ్.. రీసెంట్ గా యశోద సినిమాతో హిట్ అందుకుంది. అలాగే ఇప్పుడు శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీ నటులు ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ సినిమా చివరలో కొన్ని సన్నివేశాల్లో సందడి చేయబోతుందట.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన లైఫ్ అందరు అనుకుంటున్నట్టుగా ఎలాంటి కష్టాలు లేకుండా సాగలేదు అని అన్నారు సమంత.

విడాకుల సమయంలో తన పైన వచ్చిన ట్రోల్స్ గురించి స్పందిస్తూ.. ఆ సమయంలో నా మనసుకు నచ్చిన విధంగా రియాక్ట్ అయ్యాను అంతే అన్నారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. నేనూ ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలనూ చూశాను అన్నారు . ప్రతి రోజూ.. ‘నాకు మంచే జరుగుతుందా?’ అంటూ మా అమ్మని అడుగుతూనే ఉండేదాన్ని. చీకటి రోజులు చూశా.. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుండేవి. ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా.. మనో ధైర్యంతో ముందుకు అడుగులు వేశాను అని అన్నారు సమంత.