డైరెక్టర్‌ని కలుద్దామని వెళ్తే ఏకంగా హీరోయిన్‌ని చేశారు.. ఇప్పుడు టాలీవుడ్ ను ఏలేస్తుంది

చాలా మంది హీరోయిన్స్ ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆతర్వాత గుర్తింపు తెచ్చుకొని హీరోయిన్స్ గా మారారు. మరికొంతమంది సీరియల్స్ నుంచి హీరోయిన్స్ గా సినిమాల్లోకి వెళ్లిన వారూ ఉన్నారు.అలాగే స్టార్ హీరోయిన్స్ చాలా మంది సినిమా ఆఫీస్ లచుట్టూ తిరిగి  ఆడిషన్స్ ఇచ్చి అవకాశాలు అనుకున్న వారు కూడా ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం ఊహించని విధంగా సినిమా అవకాశాలు వస్తుంటాయి

డైరెక్టర్‌ని కలుద్దామని వెళ్తే ఏకంగా హీరోయిన్‌ని చేశారు.. ఇప్పుడు టాలీవుడ్ ను ఏలేస్తుంది
Actress
Follow us

|

Updated on: Jul 10, 2024 | 4:12 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కష్టపడి సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి అవకాశాలు అందుకుంటారు. హీరోయిన్ గా అవకాశం రావడం అంటే అంత ఈజీ కాదు. చాలా మంది హీరోయిన్స్ ఇతర సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆతర్వాత గుర్తింపు తెచ్చుకొని హీరోయిన్స్ గా మారారు. మరికొంతమంది సీరియల్స్ నుంచి హీరోయిన్స్ గా సినిమాల్లోకి వెళ్లిన వారూ ఉన్నారు.అలాగే స్టార్ హీరోయిన్స్ చాలా మంది సినిమా ఆఫీస్ లచుట్టూ తిరిగి  ఆడిషన్స్ ఇచ్చి అవకాశాలు అనుకున్న వారు కూడా ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం ఊహించని విధంగా సినిమా అవకాశాలు వస్తుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు కూడా అలానే అవకాశం వచ్చిందట. దర్శకుడిని చూద్దాం అని వెళ్తే హీరోయిన్ ను చేశారట..

వర్షం సినిమాలో సినిమా షూటింగ్ చూడటానికి వచ్చిన త్రిషను ఎలా అయితే హీరోయిన్ ను చేశారో.. రియల్ లైఫ్ లోనూ ఓ హీరోయిన్ కు సరిగ్గా అలానే జరిగిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. సమంత  హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు ఓ ఫ్యాషన్ లో వెల్కమ్ గర్ల్ గా చేసింది. ఆతర్వాత ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే సమంత గతంలో మాట్లాడుతూ.. తనకు మొదటి సినిమా అవకాశం రావడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తనకు దర్శకుడు గౌతమ్ మీనన్ అంటే చాలా ఇష్టమట.. ఆయన సినిమాలు అంటే సామ్ కు పిచ్చి అని తెలిపింది. ఓ సారి ఆయనను చూద్దామని సినిమా షూటింగ్ కు వెళ్లిందట.. కానీ ఊహించని విధంగా హీరోయిన్ గా సెలక్ట్ అయ్యాను అని తెలిపింది. ఏం మాయ చేసావె సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి సామ్ అక్కడికి వెళ్లిందట. తన ఫెవరెట్ దర్శకుడు కావడంతో ఎలాగైన ఆయనను చూడాలని ఆడిషన్స్ లో పాల్గొందట.. ఆయను చూసి వస్తే చాలు అని అనుకున్న సామ్ కు అనూహ్యంగా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చిందట.. హీరోయిన్ గా సెలక్ట్ అవుతానని అస్సలు ఉహించాలేదని.. దాంతో షాక్ తిన్నాను అని తెలిపింది సామ్. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. త్వరలోనే వరుస సినిమాలతో బిజీ కానుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే సామ్ పుట్టిన రోజు సందర్భంగా బంగారం అనే సినిమాను అనౌన్స్ చేశారు.

View this post on Instagram

A post shared by Saaki (@saaki.world)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.