
టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. విడాకుల తర్వాత సామ్ గురించి నిత్యం ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తక్కువ కాలంలో హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు దక్కించుకొని టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో కూర్చుంది ఈ బ్యూటీ. సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే యంగ్ హీరో నాగచైతన్యను పెళ్లాడింది. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించి పెళ్లాడిన ఈ సామ్ చైతూతో రీసెంట్ గా విడిపోయింది. విధాలుగా తర్వాత ఈ ఇద్దరు ఎవరిజీవితలు వారు జీవిస్తున్నారు. ప్రస్తుతం సామ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తెలుగులో గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం, అలాగే యశోద సినిమాలు చేస్తోంది.
శాకుంతలం సినిమా చేస్తోంది ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిస్టారికల్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సామ్ శకుంతల గా నటిస్తోంది. ఇటీవల ఆమె డ్రోల్స్ ఇండియా అనే ఒక బ్రాండ్ కు ప్రమోషన్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫోటోస్ లో సామ్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. సమంత లుక్ ను పలువురు పలు రకాలుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య విదేశాలకు వెళ్లిన సమంత ఎప్పుడు వస్తుంది.. ఎందుకు వెళ్లింది అంటూ పదే పదే చాలా మంది మీడియా ద్వారా ప్రశ్నించారు. అయితే ఇప్పుడు సామ్ లుక్ మారిపోవడంతో చాలా మందిలో అనేక రకాల సందేహాలు మొదలయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.