Samantha: అరె ఎంట్రా ఇది.. సమంత ధరించిన ఈ చీర ధర తెలిస్తే గుండె గుభేల్.. ఎంత ఉంటుందంటే..

భారతీయ సినీపరిశ్రమలో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ అమ్మాయి ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు.

Samantha: అరె ఎంట్రా ఇది.. సమంత ధరించిన ఈ చీర ధర తెలిస్తే గుండె గుభేల్.. ఎంత ఉంటుందంటే..
Samantha

Updated on: Jun 05, 2025 | 8:15 AM

టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన సామ్.. అందం, అభినయంతో జనాల హృదయాలను గెలుచుకుంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు శుభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సామ్.. అదే సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. పవర్ ఫుల్ నటనకు మాత్రమే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పర్చుకుంది. రెడ్ కార్పెట్ అయినా, సినిమా ఈవెంట్ అయినా, లేదా ఎయిర్ పోర్ట్ అయినా.. ప్రతీసారీ మరింత అందంగా కనిపిస్తూ జనాలను ఆకట్టుకుంటుంది. ఇటీవల సామ్ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

దుబాయ్‌లో ఒక ఆభరణాల బ్రాండ్ ప్రారంభోత్సవానికి హాజరైన సమంత అందరి దృష్టిని ఆకర్షించింది. డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేసిన అద్భుతమైన బంగారు చీరలో మరింత అందంగా కనిపించిన సామ్ ఒక విజన్ లాగా మెస్మరైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. గోల్డెన్ శారీలో సామ్ ఎంతో ఆకర్షణీయంగా ఉందంటూ కామెంట్స్ చేశారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఇప్పుడు సామ్ ధరించిన చీర ధర తెలిసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ శారీ ధర ఎంతో తెలుసా.. ? అక్షరాల రూ.3.95 లక్షలు. అవుుు.. మీరు విన్నది నిజమే.

ఇన్నాళ్లు కథానాయికగా అలరించిన సామ్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. త్రలాలా మూవింగ్ పిక్చర్స్‌ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన సామ్.. మొదటగా శుభమ్ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. శుభమ్ కంటే ముందు ఖుషి చిత్రంలో చివరిసారిగా కనిపించింది. అలాగే వరుణ్ ధావన్ సరసన సిటాడెల్: హనీ బన్నీలో కూడా నటించింది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..