ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో సమంత ఉత్తమ నటి అని హీరో శర్వానంద్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరి కాంబోలో ‘జాను’ అనే మూవీ త్వరలో విడుదల కాబోతుంది. తమిళంలో సూపర్ హిట్టయిన ’96’కు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఈ మూవీ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా సినిమా గురించి ఇటీవలే నేషనల్ మీడియాతో మాట్లాడాడు హీరో శర్వానంద్. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
1996 స్కూల్ బ్యాచ్‌కు చెందిన ఇద్దరి క్లాస్ మేట్స్ స్టోరీనే ఈ మూవీ అన్న శర్వా, మూవీ అంతా హృద్యమైన ప్రేమకథగా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. స్కూల్లో విడిపోయిన వారు.. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ కలిసినప్పడు వారిద్దరి మధ్య ఎదురయ్యే అనుభవాలు మనసును హత్తుకుంటాయని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటించిన సమంత ఉత్తమ నటి, ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె బెస్ట్ అని పేర్కొన్నారు శర్వానంద్. కాగా ‘జాను’ మూవీకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.