Samantha: సమంత ఇన్‏స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా ?.. క్షమాపణలు చెబుతూ ఆమె పోస్ట్..

| Edited By: Ravi Kiran

Jul 06, 2022 | 6:38 PM

సాంకేతిక లోపం కారణంగా సమంత ఇన్ స్టాలో ఒక పోస్ట్ తప్పుగా క్రాస్ పోస్ట్ చేయబడింది. వేరోక గ్రూపులో పోస్ట్ చేయాల్సింది సమంత ఖాతాలో పోస్ట్ అయింది.

Samantha: సమంత ఇన్‏స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా ?.. క్షమాపణలు చెబుతూ ఆమె పోస్ట్..
Samantha
Follow us on

సమంత (Samantha) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటుందో తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ.. ఎప్పుడు ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సమంత చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. సామ్ సోషల్ మీడియా ఖాతాల పట్ల ఫాలోవర్స్ సైతం ఆసక్తి చూపిస్తుంటాయి. అయితే ఇటీవల సమంత ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసిన ఓ ఫోటో గందరగోళం సృష్టించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫోటో షేర్ చేస్తూ నా ప్రజలే నా బలం, నా ధైర్యం నా నమ్మకం అంటూ క్యాప్షన్ ఉంది. దీంతో సామ్ ఖాతాలో కేటీఆర్ ఫోటో రావడమేంటంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడని సామ్ ఇలా పోస్ట్ పెట్టడానికి కారణాలేంటీ అంటూ నెట్టింట సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమంత ఇన్ స్టా అకౌంట్ హ్యాండిల్ టీం రంగంలోకి దిగింది. సామ్ ఇన్ స్టా ఖాతా హ్యాక్ చేయబడిందని.. అందుకు కారణమైనవారిని పట్టుకుంటామంటూ సమంత డిజిటల్ మేనేజర్ శేషంక క్షమాపణలు చెప్తూ.. నోట్ విడుదల చేశారు.

” సాంకేతిక లోపం కారణంగా సమంత ఇన్ స్టాలో ఒక పోస్ట్ తప్పుగా క్రాస్ పోస్ట్ చేయబడింది. వేరోక గ్రూపులో పోస్ట్ చేయాల్సింది సమంత ఖాతాలో పోస్ట్ అయింది. ఈ పోస్ట్ ఎవరు చేశారు అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు ఇలాంటి గందరగోళానికి గురైనందుకు క్షమాపణలు చెబుతున్నాము” అంటూ వివరణ ఇచ్చింది సమంత డిజిటల్ టీం. ఈ నోట్‏ను సామ్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. దీంతో సామ్ ఇన్ స్టా ఖాతా హ్యాక్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Sam

ప్రస్తుతం సామ్ యశోధ, ఖుషి సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇప్పటికే ఆమె నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ చిత్రంలోనూ నటిస్తోంది.