సమంత- నాగ చైతన్యల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడిన విషయం తెలిసిందే. తాము ఫ్రెండ్స్‌గా ఉంటామని విడిపోతున్న సమయంలో ఇరువురూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే సామాజిక మాధ్యమాల్లో తనపై పలు యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని సామ్ పరువు నష్టం కేసులు కూడా పెట్టారు. ఈ క్రమంలో సదరు లింకులను తొలగించాలని ఆ యూట్యూబ్ ఛానళ్లను కోర్టు ఆదేశించింది. తాజాగా సోషల్ మీడియాలో చైతూతో ఉన్న ఫోటోలను సమంత డిలీట్ చేస్తోంది. సామ్ తన ఇన్‌స్టా ఖాతా నుండి చైతూతో కలిసి ఉన్న చాలా ఫోటోలను తొలగించేసింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పెట్ డాగ్స్‌తో ఉన్న ఫొటోలు మినహా అన్ని వెకేషన్ చిత్రాలను తొలగించినట్లు ఆమె ఖాతాను పరిశీలిస్తే అర్థమువుతుంది. పెళ్లి ఫోటోలను కూడా ఆమె రిమూవ్ చేసింది. విడాకుల అనంతరం సామ్ మానసికంగా సంఘర్షణకు గురయినట్లు ఇటీవల కాలంలో ఆమె పోస్టులను చూస్తే అర్థం అవుతుంది. చైతూతో గడిపిన పాత జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి సమంత ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలతో తెలుస్తుంది. చివరిగా నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి ‘లాల్ సింగ్ చద్దా’ పోస్టును షేర్ చేసిన సామ్ ఇప్పుడు ఆ పోస్టును కూడా డిలిట్ చేసింది. ప్రజంట్ సామ్ మూవ్స్ చూస్తుంటే.. ఆమె నాగ చైతన్యను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ నెల ప్రారంభంలో చైతూ-సామ్ భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట 2017లో వివాహ బంధంతో ఒక్కటయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత దుబాయ్‌లో ఉంది. భారత్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. ఐదారేళ్ల వరకు సమంత డేట్స్ ఖాళీగా లేవు.
Also Read: అప్పగింతల్లో ఏడవకుండా, ఫుల్ ఖుషీగా వధువు.. ఆమె చెప్పిన రీజన్ వింటే షాక్ తినాల్సిందే