Samantha: సమంత, నాగచైతన్యల విడాకుల విషయం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ క్యూట్ కపుల్ ఒక్కసారిగా విడిపోతున్నాం అంటూ ప్రకటన చేసేసరికి అందరూ షాక్‌కి గురయ్యారు. ఇక సమంత తన భర్త నాగచైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ప్రారంభమైంది. ఈ విడాకులకు సమంతదే తప్పు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు రకరకాల కారణాలు వెతుకుతూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిపై ఒకటి రెండు సార్లు సమంత ఘాటుగానే స్పందించారు కూడా.
ఇక సమంతపై జరుగుతోన్న ట్రోలింగ్స్‌లో ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా ఒకటి. సామ్‌చైలు వీడిపోవడానికి ప్రీతమ్ జుకల్కర్ కారణమంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా కొందరు అభిమానులు జుకల్కర్ ను చంపేస్తామని బెదిరింపులకు సైతం దిగుతున్నారు. దీంతో జుకల్కర్ ఈ వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు. ఇటీవల ఓ మీడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నాకు సమంత అక్క లాంటిది. నేను తనను అలాగే పిలుస్తాను. అలాంటి మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుమానిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనకు నాగ చైతన్యతోనూ ఎన్నో రోజులుగా పరిచయం ఉందని తెలిపిన జుకల్కర్.. సామ్‌కి నాకూ మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో చైతూకి తెలుసు. ఈ విషయంపై చైతన్య కచ్చితంగా మాట్లాడాలి. అలా చెబితేనే ఇలాంటి వదంతులకు తెరపడుతుంది. ఎప్పుడైతే చైతూ దీనిపై స్పందిస్తాడో అప్పుడే ఫ్యాన్స్ తప్పుడు సందేశాలు పంపడం మానుకుంటారని చెప్పుకొచ్చాడు.
ఇక తనను తిడుతూ మెసేజ్‌లు పంపించడంపై మానసికంగా ఇబ్బందిపడ్డానని, తన మీద మాటల యుద్ధం చేసిన వారందరి గురించి సైబర్‌క్రైమ్ దృష్టికి తీసుకెళ్లానని జుకల్కర్ చెప్పుకొచ్చాడు. మరి జుకల్కర్ ఇచ్చిన ఈ క్లారిటీ తర్వాత అయినా ఫ్యాన్స్ ట్రోలింగ్ ను ఆపుతారో లేదో చూడాలి.
Also Read: Priyanka Gandhi: ప్రియాంక గాధీ మౌన దీక్ష.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్..
Viral Video: “నేను యాచకుడిని కాదు.. సంగీతంతో మీ ఆత్మను తాకాలని కోరుకుంటున్నా”..