Samajavaragamana: ఓటీటీలోకి సామజవరగమన.. స్ట్రీమింగ్ ఎప్పుడు..?ఎక్కడంటే

|

Jul 12, 2023 | 1:42 PM

వీకెండ్స్ లో ఈ మూవీకి మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందట. మరో వరం రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతుంది.

Samajavaragamana: ఓటీటీలోకి సామజవరగమన.. స్ట్రీమింగ్ ఎప్పుడు..?ఎక్కడంటే
Samajavaragamana
Follow us on

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన నయా మూవీ సామజవరాగమన. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ  సినిమా రిలీజ్ అయిన రెండు వారాలవుతున్నా ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. రూ.7 కోట్లతో తీసిన సినిమా మంచి భారీగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. వీకెండ్స్ లో ఈ మూవీకి మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందట. మరో వరం రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ ఈ నెల 22 లేదా 25 నుంచి నెట్లో ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు నటన, సీనియర్ నరేష్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా పై ఇప్పటికే సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.