Harish Shankar: పవన్ సినిమాలో సల్మాన్ ఖాన్.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Harish Shankar: పవన్ సినిమాలో సల్మాన్ ఖాన్.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
Hareesh Shankar

Updated on: Jun 10, 2022 | 7:05 AM

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్(Harish Shankar) ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరీష్ శంకర్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఆ మధ్య విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన సినిమాల తర్వాత భవదీయుడు సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారన్న వార్తలు ఇటీవల ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొట్టాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల సల్మాన్ ఖాన్ ను కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో భవదీయుడు సినిమాలో సల్మాన్ నటించే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు దర్శకుడు హరీష్ శంకర్. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను.. ఇలాంటివి ప్రచారం చేసే ముందు నన్ను ఒక్కసారి అడగండి. అంటూ హరీష్ శంకర్ రాసుకొచ్చారు. దాంతో పవన్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడం లేదు అని క్లారిటీ వచ్చేసింది. సల్మాన్ మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి