AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan : సల్మాన్ ఖాన్‏కు ఏమైందీ.. ? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కండల వీరుడు.. ఆందోళనలో ఫ్యాన్స్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. మరోవైపు బుల్లితెరపై పలు రియాల్టీ షోలు చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సల్మాన్ లుక్ చూసి ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్.

Salman Khan : సల్మాన్ ఖాన్‏కు ఏమైందీ.. ? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కండల వీరుడు.. ఆందోళనలో ఫ్యాన్స్..
Salman Khan
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2026 | 12:59 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్, ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. కండల వీరుడిగా.. రొమాంటిక్ హీరోగా రాణించారు. అంతేకాదు.. అమ్మాయిల కలల రాకుమారుడు. దశాబ్దాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో అలరిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తన ఫిట్నెస్, లుక్స్, నటనతో ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. మరోవైపు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోను మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సల్మాన్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న సల్మాన్ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి.అందులో సల్మాన్ రూపం పూర్తిగా మారిపోయి కనిపిస్తున్నాడు. దీంతో సల్మాన్ కు ఏమైందీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవల శుక్రవారం రాత్రి ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) కార్యాలయాన్ని సందర్శించారు. SRA అత్యాధునిక డేటా సేకరణ, ధృవీకరణ సహాయక కేంద్రాన్ని (ఐటీ సర్వర్ రూమ్) ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సల్మాన్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు. సల్మాన్ తన తాజా లుక్‌లో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. ఒకప్పుడు కండల వీరుడిగా కనిపించిన సల్మన్ ఇప్పుడు పూర్తిగా బక్కచిక్కిపోయి కనిపించారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

సల్మాన్ లుక్ పై నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కి ఏమైంది?? మొదట అతను కాదేమో అనుకున్నాను, కానీ అక్కడ షేరా కూడా కనిపించాడు. సల్మాన్ ఖాన్ ఆరోగ్యం అంతా బాగానే ఉందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలలో సల్మాన్ విలేకరులతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు.

ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

సల్మాన్ లుక్స్..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..

Follow Us