Viral Video: ఫోటోలు తీస్తుంటే సిగ్గుపడి దాక్కున్న హీరోయిన్.. ఇటీవలి మూవీతో సెన్సేషన్.. గుర్తుపట్టారా..?

గుర్తుపట్టారా ఈ అందాల రాశిని. ఇటీవల ఓ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇక తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో క్యూట్ లుక్‌తో మాస్క్ పెట్టుకుని కనిపించింది. అక్కడి కెమెరామెన్స్ ఫోటోలు తీస్తుంటే.. అబ్బా నాకు సిగ్గేస్తుంది అంటూ క్యూట్‌గా మాట్లాడింది.

Viral Video: ఫోటోలు తీస్తుంటే సిగ్గుపడి దాక్కున్న హీరోయిన్.. ఇటీవలి మూవీతో సెన్సేషన్.. గుర్తుపట్టారా..?
Heroine

Updated on: Jul 28, 2025 | 4:49 PM

హీరో, హీరోయిన్స్‌తో పాటు ఇతర సెలబ్రిటీల ఎయిర్‌పోర్ట్ లుక్స్ ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ తమ ట్రెండీ లుక్స్‌తో ఫ్యాన్స్ మనసు దోచుకుంటున్నారు. తాజాగా ఓ నటీమణి.. ఎయిర్‌పోర్ట్‌లో సిగ్గుపడుతూ హోయలుపోయింది. అక్కడ కెమెరామెన్స్ ఫోటోలు క్లిక్ చేస్తుంటే.. తనకు సిగ్గుగా ఉందంటూ పక్కకు తప్పుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తను మరెవరో కాదు.. ఇటీవల బాక్సాఫీస్‌ను బ్రేక్ చేసిన సైయారా మూవీ హీరోయిన్ అనీత్ పద్దా.

సైయారా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ. 217 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతూనే ఉండటంతో..  హీరోయిన్ అనీత్ పడ్డా ముంబై విమానాశ్రయంలో కనిపించింది. ఆమె మూవీ యూనిట్‌తో కలిసి సినిమా విజయాన్ని జరుపుకోవడానికి సింగపూర్‌కు విమానంలో వెళుతున్నట్లు సమాచారం.

అనీత్ బ్లూ షర్ట్, బ్లాక్ క్యాప్‌తో పాటు బ్లాక్ మాస్క్ ధరించింది. ఫోటోగ్రాఫర్లు ఆమెను మాస్క్ తీసివేసి పోజ్ ఇవ్వమని అడిగినప్పుడు.. ఆమె నవ్వుతూ “ముఝే శరం ఆ రహీ హై” అని చెప్పింది. అంటే “నాకు సిగ్గుగా ఉంది” అని తెలుగులో అర్థం. అయితే కొందరు అభిమానులకు మాత్రం ఆమె సెల్పీలు ఇచ్చింది.

సైయారా టీమ్ ఒక చిన్న వేడుక కోసం సింగపూర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కానీ ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో బాగా వసూళ్లు సాధిస్తున్నందున.. డిజిటల్ రిలీజ్ ఆలస్యం అయింది. దీపావళి సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సైయారాలో అహాన్ పాండే, అనీత్ పద్దా లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీలో ఎమోషన్స్ గురించి జనం బాగా మాట్లాడుకుంటున్నారు. మ్యూజిక్ మరో పెద్ద ఎస్సెట్ అంటున్నారు. ఫస్ట్ వీక్‌లో బుక్‌మైషోలో 3.5 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి