Ramayana Movie: అప్పటివరకు రణ్‌బీర్, సాయి పల్లవి ఇక బయట కనిపించరట.. కారణమేంటో తెలుసా?

బాలీవుడ్‌లో రాబోతున్న ‘రామాయణం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ సినిమాలో రాముడి పాత్రలో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ నటించనున్నాడు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుంది. రావణుడి పాత్ర కోసం యష్ తో చర్చలు జరుగుతున్నాయి .

Ramayana Movie: అప్పటివరకు రణ్‌బీర్, సాయి పల్లవి ఇక బయట కనిపించరట.. కారణమేంటో తెలుసా?
Sai Pallavi, Ranbir Kapoor

Updated on: Mar 24, 2024 | 5:01 PM

బాలీవుడ్‌లో రాబోతున్న ‘రామాయణం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ సినిమాలో రాముడి పాత్రలో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ నటించనున్నాడు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుంది. రావణుడి పాత్ర కోసం యష్ తో చర్చలు జరుగుతున్నాయి . అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. అయితే షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమాలోని ప్రధాన నటీనటులు పబ్లిక్ అప్పియరెన్స్ తగ్గించుకుంటారని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ‘దంగల్’ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారీ ‘రామాయణం’ చిత్రానికి దర్శకత్వం వహించనుండడంతో సినీ లవర్స్‌లో ఆశలు చిగురిస్తున్నాయి. పౌరాణిక కథాంశంతో సినిమా తీసి జనాలను మెప్పించడం అంత ఈజీ కాదు. గతంలో ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ సినిమా తీసి దర్శకుడు ఓం రౌత్ విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు నితీష్ తివారీ ఈ సినిమాను ఎలా తీయబోతున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక తమ ఆర్టిస్ట్ లుక్ రివీల్ కాకుండా చూసేందుకు సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ‘రామాయణం’ చిత్ర బృందం కూడా దీనిపై దృష్టి పెట్టింది.

రాముడిగా కనిపించనున్న రణబీర్ కపూర్, సీతగా కనిపించనున్న సాయి పల్లవి సహా పలువురు ఆర్టిస్టులు పబ్లిక్‌గా కనిపించడం మానేయాలని దర్శకుడు నితీష్ తివారీ సూచించినట్లు తెలుస్తోంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలలో శ్రీరామ నవమి సందర్భంగా రామయణ సినిమాను లాంఛ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. రామాయణం కథలో చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. అందుకోసం పలువురు ఆర్టిస్టులతో చర్చలు జరుగుతున్నాయి. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవితో పాటు బాబీ డియోల్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

 

తండేల్ సినిమాలో సాయి పల్లవి..

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.