కొందరు హీరోయిన్లు రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నా కూడా ట్రెండింగ్‌లో మాత్రం ఉండరు. కానీ మరికొందరు మాత్రం రెండేళ్లకో సినిమా చేసినా.. వాళ్ల పేరు సోషల్ మీడియాలో మార్మోగుతూనే ఉంటుంది. సాయి పల్లవి రెండో జాబితాలోకి వస్తారు. విరాట పర్వం తర్వాత తెలుగులో సినిమా చేయలేదు ఈ భామ. కానీ క్రేజ్ పరంగా మాత్రం సాయి పల్లవి నెక్ట్స్ లెవల్ అంతే. తాజాగా ఈమె నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు.
గతేడాది సాయి పల్లవి నటించిన గార్గి సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమాలో నటనకు గానూ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ అవార్డ్ వేడుకకు ముంబై వచ్చిన సాయి పల్లవిని అక్కడి మీడియా కెమెరాలతో చుట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Award vachindani ippudu cheppakudadu ani Cheppindru kadaa…How Cute ???@Sai_Pallavi92 #SaiPallavi #Gargi #CriticsChoiceAwards pic.twitter.com/6PD9pb9p4i
— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 28, 2023
సమాజంలో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో వచ్చిన గార్గికి మంచి పేరు వచ్చింది. గార్గి తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు సాయి పల్లవి. రామాయణంలో సీత పాత్ర కోసమే భారీ గ్యాప్ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నా.. ఈ ప్రాజెక్ట్‌పై సాయి పల్లవి ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. మొత్తానికి సినిమాలు చేయకుండానే.. ట్రెండింగ్ అవుతున్నారు ఈ న్యాచురల్ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..