Sai Pallavi: కాలేజీ విద్యార్థులను ‘ఫిదా’ చేసిన సాయి పల్లవి.. ‘వచ్చిండే’ పాటకు అదిరిపోయే స్టెప్పులు.. వైరలవుతోన్న వీడియో..

|

Jun 17, 2022 | 6:53 AM

Virata Parvam:న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) కి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫిదా సినిమా నుంచి నిన్నటి శ్యామ్ సింగరాయ్ మూవీ వరకు ఆమె నటించిన

Sai Pallavi: కాలేజీ విద్యార్థులను ఫిదా చేసిన సాయి పల్లవి.. వచ్చిండే పాటకు అదిరిపోయే స్టెప్పులు.. వైరలవుతోన్న వీడియో..
Sai Pallavi
Follow us on

Virata Parvam:న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) కి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫిదా సినిమా నుంచి నిన్నటి శ్యామ్ సింగరాయ్ మూవీ వరకు ఆమె నటించిన ప్రతి సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విరాట పర్వం (Virata Parvam). రానా దగ్గుబాటి ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. నక్సలిజానికి ప్రేమకథను మిళితం చేసి రూపొందించిన ఈ సినిమా శుక్రవారం (జూన్‌ 17) విడుదల కానుంది. కాగా తమ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రమోషన్‌ కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిత్రబృందమంతా విశాఖపట్నంలోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌కు వెళ్లింది. అక్కడి విద్యార్థులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.

కాగా విద్యార్థుల కోరిక మేరకు సాయిపల్లవి సరదాగా డ్యాన్స్‌ చేసింది. తనకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన ఫిదా సినిమాలోని ‘వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే’ పాటకు డ్యాన్స్‌ చేసి అలరించింది. ఈ సందర్భంగా విద్యార్థులంతా కేరింతలు, హోరుధ్వానాలతో ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..