Sai Dharam Tej: ఈసారి ‘గోలి శంకర్‌’గా రానున్న మెగా మేనల్లుడు.. మరో హిట్ ఖాయం అంటున్న ఫ్యాన్స్

రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విరూపాక్ష వసూళ్ల కూడా బాగానే రాబట్టింది.

Sai Dharam Tej: ఈసారి గోలి శంకర్‌గా రానున్న మెగా మేనల్లుడు.. మరో హిట్ ఖాయం అంటున్న ఫ్యాన్స్
Sai Dharam Tej

Updated on: Jun 15, 2023 | 10:27 AM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న తేజ్. రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విరూపాక్ష వసూళ్ల కూడా బాగానే రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత తేజ్ ఎవరోతో సినిమా చేస్తున్నదన్నదాని పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే తేజ్ సంపత్ నందితో కలిసి సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. తేజ్ కోసం సంపత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రెడీ చేసాడని తెలుస్తోంది.

మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలతో అలరించారు రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో హిట్స్ అందుకున్న సంపత్ ఇప్పుడు తేజ్ తో కూడా అలాంటి కథనే సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకు గోలి శంకర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

చివరిగా సంపత్ నంది గోపీచంద్ హీరోగా సీటీమార్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు గోలి శంకర్ టైటిల్ ను దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తేజ్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.