Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమై.. అతి తక్కువ కాలంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇటీవల చావు కబురు చల్లగా సినిమమాతో ప్రేక్షకు ముందుకు వచ్చి మంచి మరోసారి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో కార్తికేయకు జోడిగా లావణ్య త్రిపాఠీ నటించింది. తాజాగా ఈ హీరో మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేసాడు.
దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు కార్తికేయ. ఈ సినిమాను 88 రామారెడ్డి నిర్మిస్తుండగా.. ఇందులో కార్తికేయకు జోడిగా తమిళ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈమె తమిళ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు.. తమిళంలో విజయ్ సేతుపతి సరసన కరుప్పన్‌లో నటించింది తాన్యా. ఈ సినిమాలో కార్తికేయ NIA అధికారిగా నటించనున్నాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుతుంది. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తాం అంటూ చెప్పుకోచ్చాడు కార్తికేయ. ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఈ చిత్ర షూటింగ్‌ను హైదరాబాద్‌లో జరపనున్నట్లు ఆ తర్వాత మారెడుపల్లిలో జరపనున్నట్లుగా చెప్పుకోచ్చాడు చిత్ర నిర్మాత రామారెడ్డి.
Also Read: Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక
షూటింగ్ లోకేషన్లో గొడవ పెట్టుకున్న సోహైల్.. తోటి సభ్యుడి కాలర్ పట్టుకోని.. కానీ చివరకు..