‘ సైరా ‘ కు మరో షాక్..ఏం జరిగింది ?

| Edited By: Ram Naramaneni

May 16, 2019 | 8:48 PM

మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘ సైరా నరసింహారెడ్డి ‘ కి మరో షాక్ ! ఈ చిత్రంలో రష్యాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ అకాల మరణం చెందాడు. అలెగ్జాండర్ (38) అనే ఈయన టూరిస్టు వీసాపై గత మార్చి నెలలో  హైదరాబాద్ వచ్చాడని, ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో నటించాడని తెలిసింది. హైదరాబాద్ గచ్చిబౌలీ లోని డీఎల్ఎఫ్ గేటు వద్ద బుధవారం అలెగ్జాండర్   అపస్మారక స్థితిలో పడిఉండగా పోలీసులు వెంటనే మొదట కొండాపూర్ ఏరియా […]

 సైరా  కు మరో షాక్..ఏం జరిగింది ?
Follow us on
మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘ సైరా నరసింహారెడ్డి ‘ కి మరో షాక్ ! ఈ చిత్రంలో రష్యాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ అకాల మరణం చెందాడు. అలెగ్జాండర్ (38) అనే ఈయన టూరిస్టు వీసాపై గత మార్చి నెలలో  హైదరాబాద్ వచ్చాడని, ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో నటించాడని తెలిసింది. హైదరాబాద్ గచ్చిబౌలీ లోని డీఎల్ఎఫ్ గేటు వద్ద బుధవారం అలెగ్జాండర్   అపస్మారక స్థితిలో పడిఉండగా పోలీసులు వెంటనే మొదట కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి, అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. వడదెబ్బ వల్లే ఆయన మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఇతని మృతి గురించి గోవాలో ఉన్న ఇతని స్నేహితునికి పోలీసులు సమాచారమందించారు. కాగా-కోట్లాది రూపాయల విలువైన ‘ సైరా ‘ మూవీ సెట్లు రెండు అగ్ని ప్రమాదాల్లోదగ్ధమైన సంగతి తెలిసిందే.