Ruhani Sharma: రచ్చ లేపిన రుహాని శర్మ.. ఓ రేంజ్‌లో ఫోటోలకు ఫోజులిచ్చిందిగా..

|

Jun 23, 2023 | 8:44 AM

ఈ అమ్మడు చిలాసౌ సినిమాలో అచ్చమైన మద్యతరగతి అమ్మాయిలా నటించి మెప్పించింది. చక్కటి నటనతో ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకుంది. 2018లో వచ్చిన ఈ సినిమాతోనే ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Ruhani Sharma: రచ్చ లేపిన రుహాని శర్మ.. ఓ రేంజ్‌లో ఫోటోలకు ఫోజులిచ్చిందిగా..
Ruhani Sharma
Follow us on

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా చిలాసౌ.  అక్కినేని హీరో సుశాంత్ నటించిన ఈ సినిమాలో రుహాని శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడు చిలాసౌ సినిమాలో అచ్చమైన మద్యతరగతి అమ్మాయిలా నటించి మెప్పించింది. చక్కటి నటనతో ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకుంది. 2018లో వచ్చిన ఈ సినిమాతోనే ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత విశ్వక్ సేన్ నటించిన హిట్ సినిమాలో కనిపించింది. అలాగే నూటొక్క జిల్లా అందగాడు (2021) వంటి చిత్రాలలో కనిపించింది. అదేవిధంగా 2019లో కమల చిత్రంతో మలయాళంలో అడుగుపెట్టింది . ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

సైంధవ్ లో రుహాని శర్మ కీలక పాత్రలో కనిపించనుందట. ఇదిలా ఉంటే సినిమాల్లో అంతగా స్కిన్ షో చేయని ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. వయ్యారాలు ఒలకబోస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తుంది.

హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మతిపోగొడుతోంది ఈ చిన్నది. తాజాగా షర్ట్ బటన్ విప్పేసి రచ్చ చేసింది రుహాని. ఎద అందాలతో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు నెట్టింట కుర్రకారును చూపుతిప్పుకోనివ్వ కుండా చేస్తుంది. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే  హిందీలో కూడా సినిమా చేసింది. ఆగ్రా అనే సినిమాతో అక్కడ అడుగుపెట్టింది అలాగే వెబ్ సిరీస్ కూడా చేసింది.