Rs 270 Cr Row: తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వలేదు.. కోర్టు మెట్లు ఎక్కిన శివాజీ గణేశన్‌ కుమార్తెలు

|

Jul 08, 2022 | 12:32 PM

శివాజీ గణేశన్ మరణం తర్వాత రూ. 270 కోట్ల ఆస్తులను సక్రమంగా నిర్వహించలేదని, తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని శాంతి, రాజ్వీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Rs 270 Cr Row: తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వలేదు.. కోర్టు మెట్లు ఎక్కిన శివాజీ గణేశన్‌ కుమార్తెలు
Sivaji Ganesan And Prabhu
Follow us on

తండ్రి ఆస్తిలో తమకు భాగం ఇవ్వకుండా మోసం చేశారని సోదరులైన నటుడు ప్రభు(actor Prabhu), రామ్‌కుమార్‌పై ఆరోపణలు చేస్తూ నడిగర్‌ తిలకం శివాజీ గణేశన్‌(Sivaji Ganesan) కుమార్తెలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దివంగత ప్రముఖ నటుడు శివాజీ గణేశ్‌ కుమారులు ప్రభు, రామ్‌కుమార్‌, కుమార్తెలు శాంతి, రాజ్వీ ఉన్నారు. శివాజీ గణేశన్ మరణం తర్వాత రూ. 270 కోట్ల ఆస్తులను సక్రమంగా నిర్వహించలేదని, తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని శాంతి, రాజ్వీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు తెలియకుండా ఆస్తులను విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలన్నారు. వెయ్యి సవర్ల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు, రామ్‌కుమార్ అపరిహరించారని, శాంతి థియేటర్‌లో ఉన్న 82 కోట్ల రూపాయల విలువైన వాటాలను వారిద్దరి పేరిటకు మార్చుకున్నట్లు ఆరోపించారు. శివాజీ గణేశన్ రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని, జనరల్‌ పవర్ ఆఫ్‌ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారంటున్నారు. ఈ కేసులో ప్రభు, రామ్‌కుమార్‌ల కుమారులు విక్రమ్‌ ప్రభు, దుశ్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చారు.

శివాజీ గణేషన్‌ తమిళ్‌లో తొలితరం సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. ఆయన కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించారు. శివాజీ గణేషన్‌ భార్య కమలతో 1952లో పెళ్లైంది వీరికి నలుగురు పిల్లలున్నారు. వారే ప్రభు, రాంకుమార్‌, శాంతి, రాజ్వీ. 1987లో ఆయన ఓ పొలిటికల్‌ పార్టీ స్థాపించారు. తమిళ మున్నేట్ర మున్నాని పేరుతో స్థాపించిన ఈ పార్టీ రెండేళ్లే కొనసాగింది. 1989లో తన పార్టీని జనతాదళ్‌లో విలీనం చేశారు.

అయితే సినిమాల్లో ఆయన సంపాదించినదంతా వివిధ రూపాల్లో ఇన్వెస్ట్‌ చేశారు. 2001లో ఆయన చనిపోయే సమయానికి ఆస్తిపంపకాలు కాలేదు. కాని పవర్‌ ఆఫ్‌ అటార్నీ మాత్రం ప్రభు చేతికి వెళ్లింది. ఆ సమయంలో ఉన్న ఆస్తిని ప్రభునే వాటాలు వేశారు. ఈ వాటాల్లోనే అన్యాయం జరిగిందంటున్నారు కుమార్తెలు.

సినిమా వార్తల కోసం