RRR Movie : ఆర్ఆర్ఆర్ నటుడు కన్నుమూత.. హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్‌సన్ హఠాన్మరణం

|

May 23, 2023 | 7:46 AM

ఆర్ఆర్ఆర్ లో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ గా నటించారు రే స్టీవెన్‌సన్. నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఆయన. రే స్టీవెన్‌సన్ కన్నుమూశారు. 58 ఏళ్ల వయసులో రే స్టీవెన్‌సన్ కన్నుమూశారు.

RRR Movie : ఆర్ఆర్ఆర్ నటుడు కన్నుమూత.. హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్‌సన్ హఠాన్మరణం
Rrr
Follow us on

రాజమౌళి దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించిన సినిమా ఆర్ఆర్ఆర్.  ఇద్దరు స్టార్ హీరోలతో భారీ హిట్ అందుకున్నారు రాజమౌళి. చారిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరుల కలిపి ఈ సినిమాలో చూపించారు జక్కన్న.  ఇక ఈ సినిమాలో హాలీవుడ్ నటులను కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ లో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ గా నటించారు రే స్టీవెన్‌సన్. నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఆయన. రే స్టీవెన్‌సన్ కన్నుమూశారు. 58 ఏళ్ల వయసులో రే స్టీవెన్‌సన్ కన్నుమూశారు.

అయితే ఆయన మరణానికి గల కారణం తెలియలేదు. రే స్టీవెన్‌సన్ మరణంతో హాలీవుడ్ లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ ఐరిష్ నటుడు తన కెరీర్‌లో అనేక విలక్షణ పాత్రలను పోషించారు.

రే స్టీవెన్సన్ 25 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కింగ్ ఆర్థర్ (2004), ది అదర్ గైస్ (2010), థోర్ (2011), ది ట్రాన్స్‌పోర్టర్: రీఫ్యూయెల్డ్ (2015), యాక్సిడెంట్ మ్యాన్ (2018) లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. రే స్టీవెన్సన్ మరణ వార్త విని ఆర్ఆర్ఆర్ టీమ్ దిగ్బ్రాంతికి గురైంది.