Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేసిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమా పిరియాడిలా డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ సినిమా అంతా విదేశాల్లో తెరకెక్కిన విషయం ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన తర్వాత రాధేశ్యామ్ విడుదలను వాయిదా వేయమని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ.. చివరి క్షణంలో తాము కూడా చిత్రాన్ని ప్రేక్షకులకు ముందుకు తీసురాలేకపోతున్నామని ప్రకటించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలవనుందట. అయితే ఈ పాటను ప్రభాస్ , పూజ హెగ్డే లేకుండా తెరకెక్కించారట. సాంగ్ షూటింగ్ టైమ్ కి పూజ వేరే సినిమాలతో బిజీ అయిపోయిందట. డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితి కూడా లేకపోయింది. దాంతో దర్శక నిర్మాతలు గ్రాఫిక్స్ తోనే ఆ పాటను చేద్దామని ఫిక్స్ అయ్యారట. అలా ప్రభాస్ – పూజ ఇద్దరూ అవసరం లేకుండానే పూర్తిస్థాయి గ్రాఫిక్స్ తో ఒక పాటను రెడీ చేశారట.
మరిన్ని ఇక్కడ చదవండి :