Ramarao On Duty: రొమాంటిక్ మూడ్ లో’ రామారావు’.. మాస్ రాజా మూవీనుంచి అదిరిపోయే పోస్టర్..

మాస్ మహారాజ్ క్రాక్ సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. చాలా కాలాంతర్వత సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో

Ramarao On Duty: రొమాంటిక్ మూడ్ లో రామారావు.. మాస్ రాజా మూవీనుంచి అదిరిపోయే పోస్టర్..
Raviteja

Edited By: Ravi Kiran

Updated on: Oct 16, 2021 | 6:52 AM

Ramarao On Duty: మాస్ మహారాజ్ క్రాక్ సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. చాలా కాలాంతర్వత సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా అనంతరం రవితేజకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక అదే జోష్ లో మాస్ హీరో సైతం వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ వీలైనంత త్వరగా షూటింగ్స్ స్టార్ట్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ .. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవిజేత ద్విపాత్రాభినయం చేస్తుండగా.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే శరత్ మండవదర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు మాస్ రాజా.

ఈ సినిమా రామారావు ఆన్ డ్యూటీ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు రవి తేజ. ఈ సినిమాలో మాస్ రాజా సరసన దివ్యాంశ కౌషిక్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమానుంచి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఒక స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. అలాగే హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక నాజర్ – నరేష్ – పవిత్ర లోకేష్ – రాహుల్ రామకృష్ణ  ఇతరపత్రాల్లో నటిస్తున్నారు. మరి మాస్ మహారాజాకు ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Ramaraoమరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్..

Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)

Jai Bhim: “బాధింపబడ్డ వారికి లభించని న్యాయం.. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది”