RK Selvamani: ప్రముఖ దక్షిణాది దర్శకుడు, వైసీపీ(YCP) ఎమ్మెల్యే రోజా(MLA Roja) భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గతంలో నమోదైన పరువు నష్టం కేసులో కోర్టు విచారణకు సెల్వమణి హాజరు కానీ నేపథ్యంలో ఆయనపై అరెస్టు వారెంట్ ను చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్కే సెల్వమణి ప్రస్తుతం దక్షిణి భారత చలనచిత్ర కార్మిక సంఘాల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
2016లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరతో కలిసి సెల్వమణి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోద్రాతో తనకు ఏర్పడిన భేదాభిప్రాయలను చెప్పారు. అయితే సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసుతో కలిసి చేసిన వ్యాఖ్యలు తనకు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని బోద్రా జార్జి టౌన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. .2017 లో కేసు దాఖలైంది. వారిద్దరూ చేసిన వ్యాఖ్యలతో సాధారణ ప్రజల్లో తన పరవుకు భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని పిటీషనర్ పేర్కొన్నారు.
బోద్రా మరణించిన అనంతరం ఆయన కుమారుడు గగన్ బోద్రా ఈ కేసు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు కోర్టులో మంగళవారం(ఏప్రిల్ 5వ తేదీన) విచారణకు వచ్చింది. . అయితే సెల్వమణితో పాటుగా అరుళ్ అన్భరసు కోర్టు విచారణకు హాజరుకాలేదు. కనీసం సెల్వమణి తరపు న్యాయవాదులు సైతం కోర్టుకు వెళ్ళలేదు. దీంతో.. జార్జి టౌన్ కోర్టు న్యాయమూర్తి సెల్వమణి, అన్బరసుల పైనా అరెస్ట్ వారెంట్ జారీ చేసారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 23కు వాయిదా వేశారు.
Also Read: Navaratri 2022: నవరాత్రి రోజుల్లో ఏ రోజున ఈ రెండు శక్తి పీఠాల్లో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందంటే..
Fertilizer prices: అంతర్జాతీయంగా పెరగిన ఎరువుల ధరలు.. రైతులపై కేంద్రం భారం మోపేనా?