మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఎక్కడ చూసినా దేవర సందడే కనిపిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేసిన సినిమా ఇది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమా రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దేవర మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కొరటాల శివ. ఇక దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దేవర ప్రభంజనం కనిపిస్తుంది. దేవర సినిమా చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో , అలాగే కొరటాల శివ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దేవర. ఇక దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. దేవర సినిమాలో జాన్వీ నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర దేవర మొదటి భాగంలో ఎక్కువగా లేకపోయినా సెకండ్ పార్ట్ లో జాన్వీ రోల్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే దేవర సినిమాలో జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.? దేవర సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు జాన్వీ డైలాగ్స్ విని ఆమె కు స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ డబ్బింగ్ చెప్పిందని అంతా భావించారు. కానీ కాదు జాన్వీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది పీవీఎస్ శ్వేత. ఈ అమ్మడు ఆర్జేగా చాలా పాపులర్. తన వాయిస్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా శ్వేత క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో యంగ్ బ్యూటీ కృతిశెట్టికి కూడా శ్వేతనే డబ్బింగ్ చెప్పింది. అలాగే ఇంకొంతమంది హీరోయిన్స్ కు కూడా డబ్బింగ్ చెప్పింది. ఇక దేవర సినిమాలో జాన్వికపూర్ కు కూడా శ్వేత డబ్బింగ్ చెప్పి ఆకట్టుకుంది. జాన్వీ పాత్రకు శ్వేత వాయిస్ సూపర్ గా సెట్ అయ్యింది. ఇక ఈ ఆర్జే అమ్మడు సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.