Ritu Varma : ఈ తెలుగమ్మాయి ఆశలన్నీ ఆ సినిమా పైనే.. రీతువర్మ ఆ మూవీ హిట్ అందించినా..?

| Edited By: Ravi Kiran

Nov 12, 2021 | 7:02 AM

సినిమా ఇన్దట్రీలో తెలుగమ్మాయిలు ఉన్నది తక్కువే వారిలో రాణిస్తున్న బ్యూటీలు వేళల్లో లెక్కబెట్టవచ్చు.. ఆముద్దుగుమ్మల్లో ఒకరే రీతువర్మ

Ritu Varma : ఈ తెలుగమ్మాయి ఆశలన్నీ ఆ సినిమా పైనే.. రీతువర్మ ఆ మూవీ హిట్ అందించినా..?
Ritu Varma
Follow us on

Ritu Varma : సినిమా ఇన్దట్రీలో తెలుగమ్మాయిలు ఉన్నది తక్కువే వారిలో రాణిస్తున్న బ్యూటీలు వేళల్లో లెక్కబెట్టవచ్చు.. ఆముద్దుగుమ్మల్లో ఒకరే రీతువర్మ. ఈ చిన్నది పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అంతకు ముంది యంగ్ టైగర్ నటించిన బాద్షా మూవీలో చిన్న పాత్రలోమెరిసింది. ఇక పెళ్లిచూపులు సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది రీతువర్మ. అక్కడ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతోంది ఈ బ్యూటీ. ఇటీవలే నాని కథానాయకుడిగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘టక్ జగదీష్’ సినిమాలో ఆమె నాయికగా నటించింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ నటించిన వరుడు కావేలెను సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నాగశౌర్య హీరోగా లేడీ దర్శకురాలుగా లక్ష్మీ సౌజన్య ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో రీతువర్మ ఆశలన్నీ తన నెక్స్ట్ సినిమా పైనే పెట్టుకుంది . యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌‏లో 30వ సినిమాగా రూపొందుతోన్న మైల్ స్టోన్ మూవీ ఒకే ఒక జీవితం. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు. ఈ సినిమాలో రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిన్న దాని ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా రీతుకు సక్సెస్ తెచ్చిపెడుతుందేమో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Sirish: సోషల్‌ మీడియాను వీడిన అల్లు శిరీష్‌.. అసలు మ్యాటరేంటంటే..

Divi Vadthya: ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో… బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు వైరల్ 

Anchor Vishnu Priya: తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ విష్ణు ప్రియ.. ఇదిగో పోస్ట్..