RGV: ‘పెద్దమనిషి మరణానికి విలువివ్వరా?’.. టాలీవుడ్ పెద్దలపై ఆర్జీవీ సంచలన కామెంట్స్

| Edited By: Ravi Kiran

Sep 12, 2022 | 2:38 PM

ఆర్జీవీ మరోసారి టాలీవుడ్‌లో అగ్గి రాజేశారు. ఆయన మరణానికి విలువివ్వరా అంటూ టాలీవుడ్ పెద్దలను డైరెక్ట్‌గా టార్గెట్ చేశారు.

RGV: పెద్దమనిషి మరణానికి  విలువివ్వరా?.. టాలీవుడ్ పెద్దలపై ఆర్జీవీ సంచలన కామెంట్స్
Rgv Tweets
Follow us on

Krishnam Raju Death: వర్మ మరోసారి అగ్గి రాజేశారు.  టాలీవుడ్‌ పెద్దల్ని డైరెక్ట్‌గా టార్గెట్‌ చేశారు. రెబల్‌స్టార్‌కి నివాళి ఇలాగేనా.. అంటూ వరుస ట్వీట్లతో చెలరేగిపోయారు. కృష్ణంరాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూనే.. అగ్రహీరోలు, ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణం రాజు లాంటి పెద్ద మనిషి చనిపోతే.. కనీసం రెండు రోజులు కూడా షూటింగ్ ఆపలేరా అంటూ తెలుగు సినీ లోకాన్ని ప్రశ్నించారాయన. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు, లాంటి గొప్ప చిత్రాలను అందించిన మహా నటుడు చనిపోతే షూటింగ్ ఆపకపోవడం సిగ్గు సిగ్గు.. తెలుగు సినీ పరిశ్రమకి జోహార్లు అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇటీవల తెలంగాణలో షూటింగ్‌లు నిలిచిపోయాయి. ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతోందని నెల రోజులు షూటింగ్‌లు బంద్‌చేశారు. కానీ పెద్దమనిషికి విలువ ఇవ్వడం లేదు. మనసు లేకపోయినా.. కనీసం చావుకి విలువ ఇద్దాం అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..