Ram Gopal Varma: పిఠాపురం నుంచి పోటీ.. మరో బాంబ్ పేల్చిన ఆర్జీవీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అని ప్రకటించారు. ఆ వెంటనే ఆర్జీవీ ట్విట్టర్ లో నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో రచ్చ మోడలింది. ఆర్జీవీ నిజంగానే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా..? లేక పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ట్వీట్ చేశారా.?

Ram Gopal Varma: పిఠాపురం నుంచి పోటీ.. మరో బాంబ్ పేల్చిన ఆర్జీవీ
Rgv

Updated on: Mar 15, 2024 | 8:42 AM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ తో దుమారం రేపారు. నిన్న ఆర్జీవీ ట్వీట్ చేస్తూ.. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అంటూ షాక్ ఇచ్చారు. అంతకు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అని ప్రకటించారు. ఆ వెంటనే ఆర్జీవీ ట్విట్టర్ లో నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో రచ్చ మోడలింది. ఆర్జీవీ నిజంగానే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా..? లేక పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ట్వీట్ చేశారా.? అని అభిమానులంతా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మరో ట్వీట్ తో బాంబ్ పేల్చారు రామ్ గోపాల్ వర్మ.

నిన్న వర్మ ట్వీట్ చేస్తూ నేను సడన్ గా తీసుకున్న నిర్ణయం.. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నందుకు సంతోషిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. దాంతో ఒక్కసారిగా అందరూ ఆర్జీవీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చర్చించుకున్నారు. పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయనున్నాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

తాజాగా వర్మ మరో ట్వీట్ చేశారు. నా ట్వీట్‌ను తప్పుగా చదివిన వారందరికీ, నేను పిఠాపురంలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో పాల్గొంటున్నానని నా ఉద్దేశ్యం. త్వరలోనే షూటింగ్ చేయనున్నాను. మీవన్నీ ఊహాగానాలు అంటూ కౌంటర్ ఇచ్చారు ఆర్జీవీ. తాను తెరకెక్కించబోయే షార్ట్ ఫిలింలో భాగంగా ఆయన ఆ ట్వీట్ చేశానని క్లారిటీ ఇచ్చారు. ఇక వర్మ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా వ్యూహం అనే సినిమా చేశారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు శపధం అనే సినిమాను ఓటీటీలో వెబ్ సిరీస్ గా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఏపీ రాజకీయాల పైన ఆర్జీవీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ ( ట్విట్టర్ )లో కౌంటర్లు వేస్తున్న విషయం తెలిసిందే..

ఆర్జీవీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.