
సినిమా ఇండస్ట్రీలో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిశ్రమలో ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే అభినయంతో పాటూ అందమూ చాలా ముఖ్యం. కొన్ని సార్లు కేవలం గ్లామర్ నే ప్రాతిపదికన తీసుకుని సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వస్తుంటాయి. అలా ఈ ఏడాది అత్యంత అందమైన హీరోయిన్ల జాబితా ఒకటి రిలీజ్ అయ్యింది. ఐఎమ్ డీబీ లిస్ట్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. ఈ అందాల తారల జాబితాలో ఇండియా నుంచి కేవలం ఒకే ఒక్క హీరోయిన్ కు మాత్రమే స్థానం దక్కింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికా బ్యూటీ షైలీన్ వుడ్లీ రెండో స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు ప్లేసుల్లో చైనాకు చెందిన దిల్‌రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్‌డోనీ నిలిచారు.
ఈ జాబితాలో టాప్-5 లో బాలీవుడ్ భామ కృతి సనన్ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హానియా అమీర్ ఆరోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా స్పెయిన్‌కు చెందిన అనా డి అర్మాస్, పారిస్‌కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్ నిలిచారు.
కాగా ఈ జాబితాలో ఇండియా నుంచి బాలీవుడ్ అందాల తార కృతి సనన్ మాత్రమే చోటు దక్కించుకుంది. ఆమె ఈ లిస్టులో టాప్-5 ప్లేసులో నిలిచింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కృతి తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. మహేష్ బాబు నేనొక్కడినే సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అందాల తార ఆ తర్వాత దోచెయ్ సినిమాలోనూ నటించింది. ఇక ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో సీతగా నటించి అందరి మన్ననలు అందుకుంది.
Top 10 Most Beautiful Actresses in the World 2025/26
1. 🇦🇺 Margot Robbie
2. 🇺🇸 Shailene Woodley
3. 🇨🇳 Dilraba Dilmurat
4. 🇰🇷 Nancy McDonie
5. 🇮🇳 Kriti Sanon
6. 🇵🇰 Hania Aamir
7. 🇨🇺/🇪🇸 Ana de Armas
8. 🇬🇧 Emma Watson
9. 🇺🇸 Amber Heard
10. 🇹🇷 Hande Erçel(Source: IMDb List – Top… pic.twitter.com/DlW1Hj9Pzy
— Infodex (@infodexx) December 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.