Aadya: గిటార్‏ వాయిస్తూ పాట అదరగొట్టిన పవన్ కూతురు.. ఆద్య టాలెంట్‏కు అభిమానులు ఫిదా..

|

Dec 04, 2021 | 4:08 PM

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. రేణూ దేశాయ్ షేర్ చేసే ప్రతి అప్డేట్ క్షణాల్లో

Aadya: గిటార్‏ వాయిస్తూ పాట అదరగొట్టిన పవన్ కూతురు.. ఆద్య టాలెంట్‏కు అభిమానులు ఫిదా..
Renu Desai
Follow us on

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. రేణూ దేశాయ్ షేర్ చేసే ప్రతి అప్డేట్ క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఇటీవల గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్స్ చేయలేదు రేణూ దేశాయి. కరోనా సంక్షోభంలో ఎంతోమందికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎవరికైనా సాయం కావాలంటే సోషల్ మీడియాలో కోరితే వెంటనే వీలైనంత సాయం చేసేవారు. ఇక చాలా రోజుల తర్వాత తిరిగి నెట్టింట్లో యాక్టివ్ అయ్యారు రేణూ దేశాయ్. తాజాగా తన కూతురు ఆద్యకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

అందులో ఆద్య టాలెంట్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. గిటార్ వాయిస్తూ పాట పాడుతూ కనిపిస్తోంది ఆద్య. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పవర్ స్టార్ కూతురి టాలెంట్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మరోవైపు అకీరా నందన్ కూడా మ్యూజిక్ ప్లే చేయడం అంటే ఇష్టమని ఇప్పటికే తెలిసిన విషయమే. అలాగే బాస్కెట్ బాల్ ఆటలోనూ అకీరా సూపర్ ప్లేయర్..

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తుండగా.. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్ నెట్టింట్లో రికార్డ్స్ సృష్టిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈరోజు ఈ సినిమా నుంచి విడుదలైన అడవి తల్లి మాట యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

Also Read: Katrina Kaif: కత్రినా పెళ్లికి ఎంతమంది వీఐపీలు వస్తున్నారంటే!.. వివరాలు వెల్లడించిన రాజస్థాన్‌ అధికారులు..

Mahesh Babu MEK: మహేష్‌, ఎన్టీఆర్‌ల సందడికి సమయం ఆసన్నమైంది.. ఎవరు మీలో కోటీశ్వరులు టెలికాస్ట్‌ అయ్యేది..