Renu Desai: తండ్రితో కలిసి మోదీని కలిసిన అకీరా.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..

పవన్ గెలిచినప్పటి నుంచి తండ్రితోపాటే ఉంటున్నారు పవన్ తనయుడు అకీరా నందన్. ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఇంట్లో కనిపించిన అకీరా.. ఆ తర్వాత నాన్నతోపాటు తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా వెన్నంటే అకీరాను తీసుకెళ్తున్నాడు. ఇక గురువారం సాయంత్రం ప్రధాని మోదీని కుటుంబసమేతంగా కలిశాడు పవన్ కళ్యాణ్.

Renu Desai: తండ్రితో కలిసి మోదీని కలిసిన అకీరా.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..
Renu Desai

Updated on: Jun 06, 2024 | 8:16 PM

దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత అఖండ విజయంతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి భారీ మెజారిటీతో గెలవడంలో కీలకపాత్ర పోషించారు పవన్. దీంతో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు రెండు రోజులుగా సంబరాలు చేసుకుంటున్నారు. అటు ఎమ్మెల్యేగా పవన్ గెలిచినప్పటి నుంచి తండ్రితోపాటే ఉంటున్నారు పవన్ తనయుడు అకీరా నందన్. ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఇంట్లో కనిపించిన అకీరా.. ఆ తర్వాత నాన్నతోపాటు తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా వెన్నంటే అకీరాను తీసుకెళ్తున్నాడు. ఇక గురువారం సాయంత్రం ప్రధాని మోదీని కుటుంబసమేతంగా కలిశాడు పవన్ కళ్యాణ్. భార్య అన్నా లెజేనోవా, కొడుకు అకీరాతో కలిసి ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి హాజరయ్యారు.

కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. పవన్ పరిచయం చేస్తుండగా.. అకీరా ప్రధాని మోదీకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. అదే సమయంలో అకీరా భుజం పై చేయి వేసి పవన్ తో మాట్లాడుతున్నాడు మోదీ. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అకీరా మోదీని కలవడంపై రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనకు ఎంతో ఆనందంగా ఉందని.. చెప్పడానికి మాటలు రావడం లేదని అన్నారు.

“నేను ఎప్పటినుంచో బీజేపీ వ్యక్తిని. ఈరోజు నా కొడుకు అకీరాను పీఎం నరేంద్రమోదీ గారి పక్కన చూడడం ఎంతో ఆనందంగా, ఎమోషనల్ గా ఉంది. దీనిపై నాకు చాలా రాయాలని ఉంది. కానీ మాటలు రావట్లేదు. నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. మోడీని కలిసాక అకీరా నాకు కాల్ చేశాడు. మోడీ గారు చాలా స్ట్రాంగ్ పర్సన్. ఆయన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు” అంటూ పవన్, అకీరా మోడీని కలిసిన ఫోటోస్ కలిపి ఓ వీడియో షేర్ చేసింది రేణూ దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.