అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ మళ్ళీ వాయిదా

అల్లు శిరీష్ హీరోగా తాజా చిత్రం ‘ఏబీసీడీ’ రూపొందింది. మలయాళంలో విజయవంతమైన ‘ఏబీసీడీ’కి ఇది రీమేక్. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా చెప్పినట్టుగానే మార్చి1వ తేదీనే విడుదల చేయవలసింది. కానీ కొన్ని కారణాల వలన మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోని ఆలస్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవడం వలన, ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే విడుదల తేదీని […]

అల్లు శిరీష్ 'ఏబీసీడీ' మళ్ళీ వాయిదా
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 2:22 PM

అల్లు శిరీష్ హీరోగా తాజా చిత్రం ‘ఏబీసీడీ’ రూపొందింది. మలయాళంలో విజయవంతమైన ‘ఏబీసీడీ’కి ఇది రీమేక్. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా చెప్పినట్టుగానే మార్చి1వ తేదీనే విడుదల చేయవలసింది. కానీ కొన్ని కారణాల వలన మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోని ఆలస్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవడం వలన, ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా అయినా అల్లు శిరీష్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.