Sonu Sood : సోనుసూద్ కోసం750 కిలోమీటర్లు నడిచి వెళ్లిన వెంకటేష్‌కి గుర్తింపు.. అప్ప్రెసియేషన్ సర్టిఫికెట్, మెడల్‌తో సత్కారం..

|

Jul 07, 2021 | 6:10 AM

Sonu Sood : సోనుసూద్‌ ఇప్పుడు దేశంలో ఈ పేరు తెలియనివారుండరు. అభినవ కర్ణుడిగా పేరు పొందాడు. వృత్తి నటన అయితే ప్రవృత్తి

Sonu Sood : సోనుసూద్ కోసం750 కిలోమీటర్లు నడిచి వెళ్లిన వెంకటేష్‌కి గుర్తింపు.. అప్ప్రెసియేషన్ సర్టిఫికెట్, మెడల్‌తో సత్కారం..
Venkatesh
Follow us on

Sonu Sood : సోనుసూద్‌ ఇప్పుడు దేశంలో ఈ పేరు తెలియనివారుండరు. అభినవ కర్ణుడిగా పేరు పొందాడు. వృత్తి నటన అయితే ప్రవృత్తి దానం చేయడం. సోనుసూద్ చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్త నిర్బంధం కారణంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని సొంత ఖర్చులతో వారిని ఊర్లకు పంపించాడు. అలాగే ఆక్సిజన్ కొరత ఉన్నచోట్ల సిలిండర్లు సమకూర్చాడు. ఉపాధి కోల్పోయిన వారికి బ్రతుకు దెరువు చూపించాడు.

ఇన్నీ సేవలు చేసిన సోనుకి ఫ్యాన్స్ ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఆయన సేవలను చూసి ముగ్ధుడై, అతడికి వీర అభిమాని కావాలని ఓ యువకుడు ఆరాటపడ్డాడు. వికారాబాద్‌కి చెందిన వెంకటేశ్ అనే యువకుడు ముంబైకి కాళ్లకు చెప్పులు లేకుండా పాదయాత్ర చేశాడు. ఏకంగా 750 కిలోమీటర్లు నడిచి సోనుసూద్‌ని చేరుకున్నాడు. అయితే అంత దీక్ష, పట్టుదలతో పాదయాత్ర చేసిన వెంకటేశ్‌ని ‘High Range – book of world records’ అను సంస్థ వారు అభినందించారు.

Certificate

‘సర్టిఫికెట్ అఫ్ అప్ప్రీసియేషన్’ (medal అండ్ certificate) శ్రీ జస్టిస్ జి చంద్రయ్య, ఛైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, సంస్థ CEO శ్రీ సుమన్ గారు శ్రీ దైవజ్ఞ శర్మ గారి సమక్షములో అందించారు. ఈ సందర్భంగా శ్రీ జస్టిస్ జి చంద్రయ్య గారు మాట్లాడుతూ – పట్టుదల, కార్యదీక్ష, అంకితభావం, మానవతా విలువలు గల ఈ యువకున్ని (వెంకటేష్) చూస్తే మహాత్మా గాంధీ గారు గుర్తుకొస్తున్నాడని తెలిపారు. ఇదే స్ఫూర్తి తో చుదువుకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతే మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. బాలునికి తమ చేతుల ద్వారా శాలువా తో అభినందించారు.

Adah Sharma: సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్న హాట్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

India vs Sri Lanka: జీరో నుంచి మొదలుపెడతా.. ఐపీఎల్ లో ఆడినట్లే.. లంకలోనూ రిపీట్ చేస్తా: టీమిండియా యంగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్

CM JAGAN: వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు జిల్లాల పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం