Eesha Rebba: సమంతతో నటించే చాన్స్‌ వద్దునుకున్న ఈషా.. భారీ చిత్రానికి నో చెప్పడానికి కారణం అదేనా..?

Why Eesha Rebba Reject Movie: 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార ఈషా రెబ్బ. ఇక 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈషా మంచి గుర్తింపే సంపాదించుకుంది. అయితే కొన్ని సినిమాల్లో అడపాదడపా హీరోయిన్‌గా నటించే అవకాశాలు సొంతం చేసుకుంటన్నా..

Eesha Rebba: సమంతతో నటించే చాన్స్‌ వద్దునుకున్న ఈషా.. భారీ చిత్రానికి నో చెప్పడానికి కారణం అదేనా..?
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 04, 2021 | 6:27 PM

Why Eesha Rebba Reject Movie: ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార ఈషా రెబ్బ. ఇక ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈషా మంచి గుర్తింపే సంపాదించుకుంది. అయితే కొన్ని సినిమాల్లో అడపాదడపా హీరోయిన్‌గా నటించే అవకాశాలు సొంతం చేసుకుంటన్నా.. ఆశించిన స్థాయిలో విజయాల్ని మాత్రం అందుకోలేకపోతోందీ బ్యూటీ.

ఇక ఇటీవల ఈ అమ్మడు నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ‘పిట్ట కథలు’ వెబ్‌ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. తాజాగా ఈషా రెబ్బా ఓ భారీ చిత్రానికి నో చెప్పిందన్న వార్తలు టాలీవుడ్‌ వర్గాల్లో భారీగా వినిపించాయి. వివరాల్లోకి వెళితే.. గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ఓ భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మహాభారతంలోని ఆదిపర్వం నుంచి తీసుకున్న ఈ సినిమాకు ‘శాకుంతలం’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఈషా రెబ్బాను తీసుకోవాలని చిత్ర యూనిట్‌ భావించదంట. సమంతతో సమానమైన పాత్ర కాకపోయినప్పటికీ ఈషాకు కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈషా రెబ్బా ఈ సినిమాలో నటించడానికి నో చెప్పిందని తెలుస్తోంది. తక్కువ పారితోషకం ఆఫర్‌ చేయడం వల్లే శాకుంతలంలో నటించడం ఇష్టం లేదని తేల్చి చెప్పినట్లు టాక్‌ వినిపిస్తోంది. మరి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమాలో ఈషాకు తక్కువ పారితోషకం ఇస్తామనడానికి కారణేమంటన్న దానిపై చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందిస్తేగానీ తెలియదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దర్శకుడు గుణశేఖర్‌ శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చూపించనున్నారు. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు.

Also Read: రాంగ్ రూట్‏లో వచ్చిన ‘మహానటి’ హీరో.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మందలించిన పోలీస్.. నెట్టింట్లో వీడియో వైరల్..

Netflix Launches Fast Laughs : టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రముఖ సంస్థ.. ప్రస్తుతం ios ఫోన్లకే పరిమితం

మరోసారి ‘సారంగదరియా’తో ఫిదా చేసిన సాయిపల్లవి.. హైబ్రిడ్ పిల్ల గురించి మీకు తెలియని విషయాలు..

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్