‘గాశారం గుంజి తంతే బొక్కలొచ్చి పడ్డారు’, ‘జాతి రత్నాలు’ ట్రైలర్ నాన్‌స్టాప్ నవ్వులు. రివీల్ అయిన ప్రభాస్ కొత్త లుక్
Jathi Ratnalu Trailer: నవీన్ పొలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన ప్రాతదారులుగా తెరకెక్కుతోన్న చిత్రం 'జాతి రత్నాలు'. మహానటిలాంటి అద్భుత సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో సినిమాపై...
Jathi Ratnalu Trailer: నవీన్ పొలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన ప్రాతదారులుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతి రత్నాలు’. మహానటిలాంటి అద్భుత సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక మొదటి నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్లు సినిమాపై మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. హీరో ప్రభాస్ ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశాడు. 2 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి మాటతీరు, యాక్టింగ్ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇతనితో పాటు ప్రియదర్శిని, రాహుల్ రామకృష్ణ నటన కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘టెన్త్‌లో 60 శాతం, ఇంటర్‌లో 50 శాతం, బీటెక్‌లో 40 శాతం ఎంట్రా ఈ మార్కులు అన్న ప్రశ్నకు.. నవీన్ పొలిశెట్టి స్పందిస్తూ.. ‘అందుకే ఎంటెక్ చేయలేదు అన్న’ అని చెప్పే సమాధానంతో ట్రైలర్ మొదలవుతుంది. నవీన్ పొలిశెట్టి ఇంగ్లిష్ మాట్లడడం, ముగ్గురు మిత్రులు కలిసి చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. ఇక ఈ ముగ్గురు జైలుకు వెళ్లిన సమయంలో వచ్చే పాటలోని ‘గాశారం గుంజి తంతే బొక్కలొచ్చి పడ్డారు’ చరణం ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ చివరిలో కనిపించిన బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. స్నప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే ప్రభాస్ ట్రైలర్ విడుదల చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ట్రైలర్ రిలీజ్‌తో ప్రభాస్ ఆదిపురుష్ లుక్ బయటకొచ్చిందని చెప్పాలి. క్లీన్ షేవ్‌తో మీసం కట్టుతో ఉన్న ప్రభాస్‌ను చూసిన ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Also Read: ఇంట్రెస్టింగ్గా సైనా నెహ్వాల్ బయోపిక్ టీజర్… పరిణితిచోప్రా నటన అదుర్స్.. రిలీజ్ ఎప్పుడంటే..