Actress Gopika: వారేవ్వా.. ఆటోగ్రాఫ్ హీరోయిన్ గోపిక కూతురు ఇంతందంగా ఉందా.. ? వైరలవుతున్న కొత్త ఫోటో..
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో ఎస్.గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో భూమిక, గోపిక, కనికా ముగ్గురు హీరోయిన్లుగా నటించారు. అందం, అభినయంతో ఈ మూవీలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది గోపిక. మలయాళీ అమ్మాయి పాత్రలో చాలా సహజంగా కనిపించింది.
చూడచక్కని రూపం.. పొడవైన జుట్టుతో అప్పట్లో దక్షిణాది కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది గోపిక. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సౌత్ అడియన్స్ అభిమానాన్ని గెలుచుకుంది. దక్షిణ భారత చిత్రసీమలోని అగ్రకథానాయికలలో ఒకరిగా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. గోపిక.. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో ఎస్.గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో భూమిక, గోపిక, కనికా ముగ్గురు హీరోయిన్లుగా నటించారు. అందం, అభినయంతో ఈ మూవీలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది గోపిక. మలయాళీ అమ్మాయి పాత్రలో చాలా సహజంగా కనిపించింది.
నా ఆటోగ్రాఫ్ మెమొరీస్ సినిమా తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. గోపిక అసలు పేరు గ్లోరీ ఆంటో. చివరగా వీడు మామూలోడు కాదు సినిమాలో కనిపించింది. 2008లో ఉత్తర ఐర్లాండ్ లో పనిచేస్తున్న డాక్టర్ అజిలేష్ చాకోను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని బ్రిస్పేన్ లో స్థిరపడ్డారు. 2013 నుంచి గోపిక సినిమాలకు దూరంగా ఉంటుంది.
చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న గోపిక.. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. కానీ అప్పుడప్పుడు గోపిక కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుంటాయి. తాజాగా గోపిక ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతుంది. అందులో తన కూతురితో కలిసి సరదాగా నవ్వుతూ కనిపించింది. గోపిక కూతురు ఎంతో క్యూట్ గా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.