Khiladi Trailer: రవితేజ ఖిలాడి ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్‏తో మరోసారి అదరగొట్టిన మాస్ మాహారాజా..

|

Feb 07, 2022 | 7:11 PM

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ ఇప్పుడు ఖిలాడి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Khiladi Trailer: రవితేజ ఖిలాడి ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్‏తో మరోసారి అదరగొట్టిన మాస్ మాహారాజా..
Khiladi Trailer
Follow us on

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం పుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ ఇప్పుడు ఖిలాడి (Khiladi) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‏గా ఈ సినిమా రాబోతుందని ముందునుంచి టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , పాటలు, అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రెండు విభిన్నమైన పాత్రల్లో రవితేజ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఖిలాడి విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో కాసేపటి క్రితం ఖిలాడి ట్రైలర్ విడుదల చేశారు. అనుకున్నట్టుగానే ఈ సినిమాలో రవితేజ విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో రవితేజ మాస్ యాంగిల్ మరోసారి చూపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే రవితేజ కామెడీ యాంగిల్ కూడా ఇందులో ఉండనుంది. అలాగే ఫుల్ జోష్‏లో ఉండగా.. అనసూయ, రవితేజ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో సీనియర్ హీరో అర్జున్.. విలన్ పాత్రలో నటించారు. అలాగే వెన్నెల కిశోర్.. మురళీ శర్మ, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్‏తో ఖిలాడిపై అంచనాలను మరింత పెంచేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాతో రవితేజ మరోసారి అభిమానులు ఫుల్ మాస్ ఎంటర్‏టైనర్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)