Ravi Teja: మస్త్ కాన్ఫిడెన్స్‌తో మాస్ రాజా.. హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్

|

Nov 22, 2022 | 9:10 AM

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్లీ క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు రవితేజ. ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక క్రాక్ సినిమా తర్వాత యధావిధిగా ఫ్లాప్ లు వరస కట్టాయి. దాంతో ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

Ravi Teja: మస్త్ కాన్ఫిడెన్స్‌తో మాస్ రాజా.. హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్
Ravi Teja
Follow us on

మాస్ మహారాజ రవితేజ చాలా కాలంగా సాలిడ్ హిట్ అందుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒక్క హిట్ వచ్చిందంటే మళ్లీ వరుసగా ఫ్లాప్ లు పలకరిస్తున్నాయి. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్లీ క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు రవితేజ. ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక క్రాక్ సినిమా తర్వాత యధావిధిగా ఫ్లాప్ లు వరస కట్టాయి. దాంతో ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం  చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్స్ అందుకుంటుంటే మాస్ రాజా మాత్రం యావరేజ్ వచ్చిన చాలు అన్నటుగా సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మాస్ రాజా ఆశలన్నీ ధమాకా సినిమా పైనే పెట్టుకున్నారు. కమర్షియల్ మూవీ మేకర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. ఈ సినిమాలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా “ధమాకా” నుండి డు డు సాంగ్ ని నవంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రవితేజ్ లుక్ టెర్రిఫిక్ గా వుంది. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే రా లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన త్రినాద్.. ఇప్పుడు మాస్ మసాలా కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. మరి ఈ సినిమా మాస్ రాజా ఆశలను నిలబెడుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్. ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రవితేజ. అలాగే టైగర్ నాగేశ్వరావు అనే సినిమా కూడా చేస్తున్నారు రవితేజ.

ఇవి కూడా చదవండి