Ravi Teja : మరోసారి గొంతు సవరించనున్న మాస్ రాజా.. దేవీ శ్రీ కోసం సింగర్‌గా రవితేజ..

|

Dec 08, 2021 | 6:59 PM

మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో భారీ హిట్ కొట్టిన రవితేజ.

Ravi Teja : మరోసారి గొంతు సవరించనున్న మాస్ రాజా.. దేవీ శ్రీ కోసం సింగర్‌గా రవితేజ..
Raviteja
Follow us on

Ravi Teja : మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో భారీ హిట్ కొట్టిన రవితేజ. ఇప్పుడు అదే జోష్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవితేజ. ఖిలాడి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా థ్రిల్లర్ గా రానుంది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ సినిమా అంటే హుషారైన పాట ఉండాల్సిందే. ఈ సినిమాలో కూడా ఓ ఎనర్జిటిక్ సాంగ్ ఉండనుందట. ఈ పాటకు దేవీ శ్రీ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారని తెలుస్తుంది. అయితే దేవీశ్రీ ప్రతి సినిమాలో ఓ పాట ఆయనే పాడుతారు. కానీ ఈసారి ఈ సినిమాలో రవితేజ పాట పడనున్నారని తెలుస్తుంది.

రవితేజ బడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఈ పాట ఉండనుందని టాక్. గతంలో కూడా రవితేజ పాటలు పాడారు. ‘కాజల్ చెల్లివా’ (బలుపు) ‘నాటోంకి నాటోంకి’ (పవర్) ‘రమ్ పమ్ బమ్’ (డిస్కోరాజా) పాటలు పాడారు.త్వరలోనే ఈ పాటను దేవిశ్రీ రికార్డు చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ పాట నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి- డింపుల్ హయతి అందాల సందడి చేయనున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lasya Manjunath: అరవిరిసిన లాస్యం గులాబీ పువ్వుల నవ్వుతు ఫోజులిచిన్న యాంకరమ్మ

క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్