Ravi Teja: శబాష్ మాస్ రాజా .. రవితేజ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

ఇప్పుడు హీరోగా ఫుల్ బిజీ అయ్యారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. రవితేజ నటించిన చివరి మూవీ రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Ravi Teja: శబాష్ మాస్ రాజా .. రవితేజ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
Raviteja

Updated on: Dec 14, 2022 | 7:19 AM

మాస్ మహారాజా రవితేజ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఒకప్పుడు సేడ్ రోల్స్ చేస్తూ అప్పుడప్ప్పుడు సినిమాల్లో కనిపించిన రవితేజ. ఇప్పుడు హీరోగా ఫుల్ బిజీ అయ్యారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. రవితేజ నటించిన చివరి మూవీ రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో ఆయన నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలను లైనప్ చేశారు. వాటి ముందుగా ధమాకా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా రవితేజ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ రాజా మంచి మనసుకు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా ధమాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో ఫోటోలు దిగారు రవితేజ.  ఎంతో ఎనర్జీగా కనిపించిన మాస్ రాజా.. అభిమానలతో చాలా ఆప్యాయంగా మాట్లాడి వారితో ఫోటోలు దిగారు.. అక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం చేస్తూ.. వారికెలాంటి ఇబ్బంది కలుగకుండా వెంట వెంటనే ఫోటోలిచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే అక్కడకు వచ్చిన ఒక మహిళా అభిమాని.. స్టేజ్ పైన రవితేజ కాళ్లకు నమస్కరించబోయింది…ఇంతలో ఆయన అమ్మమ్మా.. వద్దంటూ రిక్వెస్ట్ చేశారు.. వికలాంగుడైన ఓ అభిమాని చేతికర్రను తను పట్టుకుని ఫోటోలు దిగారు. అలాగే చిన్న పిల్లలతో కూడా ఫోటోలు దిగారు. అలాగే దర్శకుడు బాబీ కూడా రవితేజతో ఫోటో దిగారు. ప్రస్తుతం రవితేజ బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..