Ravi Teja: పాత రూటులో రవితేజ.. మాస్ జాతరపై మాస్ రాజా భారీ ఆశలు..!

గత పదేళ్ళులో కేవలం ఒక్క హిట్ ఇచ్చిన రవితేజ.. రెండు మూడు ఫ్లాపులిచ్చారు. ఈ మధ్య మాస్ రాజా నుంచి వచ్చిన కొన్ని సినిమాలు చూశాక.. కేవలం రెమ్యునరేషన్ కోసమే సినిమాలు ఒప్పుకుంటున్నాడా ఏంటి అనే విమర్శలు ఫ్యాన్స్ నుంచే వచ్చాయి. నాలుగేళ్ళ కింద క్రాక్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన రవితేజ.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతో మళ్లీ ట్రాక్ తప్పారు.

Ravi Teja: పాత రూటులో రవితేజ.. మాస్ జాతరపై మాస్ రాజా భారీ ఆశలు..!
Ravi Teja

Edited By: Janardhan Veluru

Updated on: Feb 07, 2025 | 5:50 PM

రవితేజ పనైపోయిందిరా.. ఒక్క హిట్ కొడితే రెండు మూడు ఫ్లాపులిస్తాడు.. రెమ్యునరేషన్ బాగా ఇస్తే కథ కూడా పట్టించుకోడు..! ఇవే బయట కామన్‌గా మాస్ రాజాపై వచ్చే కామెంట్స్. అందులో నిజం లేదని నిరూపించుకునే పనిలో బిజీ అయ్యారు రవితేజ. మరి దానికోసం మాస్ రాజా ఏం చేస్తున్నాడు..? ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నాడు..? గత కొన్నేళ్లుగా రవితేజ వరస విజయాలు అందుకున్న సందర్భాలు తక్కువ.. నిజం చెప్పాలంటే అసలు లేవనే చెప్పాలి. చివరగా 2010లో డాన్ శీను, 2011లో మిరపకాయ్‌తో వరసగా రెండు హిట్స్ ఇచ్చారు రవితేజ. దానికంటే ముందు దుబాయ్ శీను, కృష్ణ.. 2001-02 టైమ్‌లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్ లాంటి వరస హిట్స్ ఇచ్చాడు మాస్ రాజా.

గత పదేళ్ళులో కేవలం ఒక్క హిట్ ఇస్తే.. రెండు మూడు ఫ్లాపులిచ్చారు రవితేజ. ఈ మధ్య మాస్ రాజా నుంచి వచ్చిన కొన్ని సినిమాలు చూశాక.. కేవలం రెమ్యునరేషన్ కోసమే సినిమాలు ఒప్పుకుంటున్నాడా ఏంటి అనే విమర్శలు ఫ్యాన్స్ నుంచే వచ్చాయి. నాలుగేళ్ళ కింద క్రాక్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన రవితేజ.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతో మళ్లీ ట్రాక్ తప్పారు. రవితేజ అంతే.. ఇక మారడు.. పనైపోయిందనుకుంటున్న తరుణంలో ధమాకాతో రూ.100 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. రొటీన్ కంటెంట్‌తోనే వచ్చినా.. మాస్ రాజా ఇమేజ్ బాగా యూజ్ అయింది. ఇక వాల్తేరు వీరయ్య విజయంలో బ్యాక్ బోన్‌లా నిలిచారు రవితేజ. కానీ ఆ వెంటనే మళ్లీ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులిచ్చాడు.

ప్రయోగాలు తనకు వర్కవుట్ కావని.. మళ్లీ మాస్ కంటెంట్‌పై ఫోకస్ చేసాడు రవితేజ. అది కూడా వర్కవుట్ కాలేదు. హరీష్ శంకర్‌తో చేసిన మిస్టర్ బచ్చన్ దారుణంగా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం భాను భోగవరపుతో పూర్తిగా వింటేజ్ లుక్ ఉండేలా మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. పైగా ఇది తనకు 75వ సినిమా కావడంతో రవితేజకు చాలా కీలకంగా మారింది. ఫ్యాన్స్ కూడా మాస్ జాతరపై అంచనాలు హై రేంజ్‌లోనే ఉన్నాయి. చిరంజవి విశ్వంభర కారణంగా మాస్ జాతర రిలీజ్ కాస్త ఆలస్యం కావొచ్చన్న టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్‌తోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు మాస్ రాజా. మొత్తానికి కుర్ర దర్శకులకు ఛాన్సులిస్తూ దూకుసుపోతున్నాడు రవితేజ.