Ravi Mohan: స్టార్ హీరోతో డేటింగ్, ప్రెగ్నెన్సీ.. రూమర్లపై కుండబద్దలు కొట్టేసిన సింగర్.. అలా అనేసిందేంటి?

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), ఆయన సతీమణి ఆర్తి రవి మధ్య విడాకుల వ్యవహారం తమిళ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో రవి మోహన్, ఆయన భార్య ఆర్తి, సింగర్ కెనీషా (రవి ప్రియురాలు) మధ్య మాటల తూటాలు పేలాయి.

Ravi Mohan: స్టార్ హీరోతో డేటింగ్, ప్రెగ్నెన్సీ.. రూమర్లపై కుండబద్దలు కొట్టేసిన సింగర్.. అలా అనేసిందేంటి?
Ravi Mohan, Kenishaa

Updated on: Jun 09, 2025 | 6:31 PM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో రవి మోహన్, ఆయన భార్య ఆర్తి కుటుంబ వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరు ఇప్పటికే విడిగా ఉంటున్నారు. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఆర్తి కూడా తన భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. బదులుగా రవి మోహన్ కూడా తన భార్యపై విరుచుకు పడ్డాడు. ఇలా ఒకరిపై ఒకరు వరుస లేఖాస్త్రాలు సంధించుకుని వార్తల్లో నిలిచారు రవి మోహన్- ఆర్తి. ఇదే వీరి విడాకుల వ్యవహారంలో ప్రముఖ సింగర్ కెన్నీషా పేరు తెరపైకి వచ్చింది. కెన్నీషా కారణంగానే రవి మోహన తనకు విడాకులు ఇస్తున్నాడంటూ ఆర్తి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే జయం రవి, కెన్నీషా ఓ వివాహా వేడుకలో కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కూడా రవి మోహన్, కెన్నీషా పూల దండలు వేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో వీరు పెళ్లి చేసుకున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. అయితే తమిళనాడులోని కుంద్రకుడి మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో పూజారులతో కలిసి వీరు తీసుకున్న ఫొటో అని తర్వాత తెలిసింది.

కొద్ది రోజులు ఆగండమ్మా.!

కాగా కొద్దికాలంగా సింగర్ కెన్నీషాపై సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్లపై స్పందించింది కెనీషా. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె రవి మోహన తో రిలేషన్ షిప్, ప్రెగ్నెన్సీ రూమర్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ‘చూడండి.. నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది.. నేనేమీ గర్భవతిని కాదు.. ఎవరు ఏమి చెప్పినా వారి కర్మ వాళ్లే అనుభవిస్తారు. నిజం, అబద్ధాలు ఏంటనేది అతి త్వరలోనే తెలుస్తాయి. అప్పటి వరకు అందరూ ఇంట్లో బిర్యానీ తయారు చేసుకుని ప్రశాంతంగా తినండి. అలాగే నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి’ అని తన దైన శైలిలో రియాక్ట్ అయ్యింది కెనీషా. ప్రస్తుతం ఈ స్టార్ సింగర్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

 కోలీవుడ్ స్టార్ సింగర్ కెనీషా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.