AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనికంటే లక్ష ఎక్కువ రెమ్యునరేషన్ అడిగా..! షాకింగ్ విషయం చెప్పిన రవిబాబు

టాలీవుడ్ దర్శకుడు రవిబాబు తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సెట్‌లో తన కోపం, బూతుల గురించి స్పందిస్తూ, తాను 100 శాతం నిబద్ధతతో పనిచేస్తానని, అదే స్థాయి నిబద్ధతను ఇతరుల నుండి కూడా ఆశిస్తానని తెలిపారు.

అతనికంటే లక్ష ఎక్కువ రెమ్యునరేషన్ అడిగా..! షాకింగ్ విషయం చెప్పిన రవిబాబు
Ravibabu
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2026 | 1:47 PM

Share

రవిబాబు సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దర్శకుడిగా విభిన్న సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రవిబాబు. అలాగే నటుడిగానూ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఓ ఇంటర్వ్యూలో తెలుగు చిత్ర పరిశ్రమలో స్థానిక నటుల పారితోషికాలు, అవకాశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక సినిమా అనుభవాన్ని పంచుకుంటూ, ఆయన తన వాదనను బలంగా వినిపించారు. ఒకసారి, రామానాయుడు స్టూడియో ఎడిటింగ్ సమయంలో ఉన్నప్పుడు సురేష్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి, ఒక లాయర్ పాత్ర ఉందని, డేట్స్ కావాలని కోరారని రవిబాబు తెలిపారు. ఆ సమయంలో తనకు జుట్టు లేకపోయినా, పర్వాలేదని చెప్పి, వేషానికి ఓకే చేశానని పేర్కొన్నారు. అయితే, పారితోషికం విషయంలో చర్చ వచ్చినప్పుడు, రవిబాబు తనతోటి నటుడు, హిందీ నటుడు అశుతోష్ రానాకు ఇస్తున్న పారితోషికం వివరాలను అడిగారట. అశుతోష్ రానాకు ఇచ్చే దానికంటే తనకు లక్ష రూపాయలు ఎక్కువ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారట. దీనికి కారణాలు కూడా చెప్పారట రవిబాబు..

Jabardasth Naresh: మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు నాకు ఇచ్చేది ఎంతంటే

తనకు తెలుగు వచ్చు, అశుతోష్ రానాకు తెలుగు రాదని; తన హైట్ అశుతోష్ రానా కంటే ఎక్కువని; తన ఇంట్లోనే తాను ఉంటానని, ఢిల్లీ నుంచో, బొంబాయి నుంచో బిజినెస్ క్లాస్‌లో రానని; తనకు మేకప్ మ్యాన్, అసిస్టెంట్ లేరని, తన కారును తనే నడుపుకుని వస్తానని, డ్రైవర్‌కు బత్తా ఇవ్వాల్సిన అవసరం లేదని రవిబాబు వివరించారట. అన్నింటికంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అశుతోష్ రానా కంటే తనకే వంద రెట్లు ఎక్కువ ఇమేజ్ ఉందని ఆయన బలంగా వాదించారట. ఒక స్థానిక నటుడిగా, ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు, ఇతర నటుడికి ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ వాదనకు నిర్మాతల వద్ద సమాధానం లేదని ఆయన తెలిపారు.

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

జగపతిబాబు గురించి మాట్లాడుతూ.. లెజెండ్ సినిమాలో విలన్‌గా ఆయన అద్భుతమైన నటనను ప్రదర్శించినప్పటికీ, తెలుగువాడైన జగపతిబాబును కాదని, మలయాళం లేదా తమిళ్ నుంచి విలన్లను తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జగపతిబాబు అసమర్థుడేం కాదని, ఆయన మంచి నటుడని రవిబాబు స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటువంటి అసమానతలు, అన్యాయాలు ఉన్నాయని, అయితే ఇవి ఎవరూ సరిదిద్దలేనివని ఆయన అంగీకరించారు. దర్శకులు లేదా నిర్మాతల వ్యక్తిగత అభిరుచులు దీనికి కారణం కావచ్చని, కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే తాము చేసేది తప్పు అని తెలిసి కూడా చేస్తున్నామని రవిబాబు అన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us