Rashmika- Vijay Wedding : పెళ్లి సందడి షూరు.. జపనీస్ వంటకాలు.. 100 మంది అతిథులు.. రష్మిక, విజయ్ పెళ్లిలో ప్రత్యేకతలు ఇవే..

ఎట్టకేలకు ప్రేమ బంధం పెళ్లిగా మారబోతుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరో రెండు రోజుల్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికీ ఇరు కుటుంబాలు రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్ కు చేరుకున్నారు. మంగళవారం మెహందీ వేడుకలతో వీరిద్దరి పెళ్లి పనులు షూరు అయ్యాయి. ఈ వేడకలకు దాదాపు 100 మంది అథితులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Rashmika- Vijay Wedding : పెళ్లి సందడి షూరు.. జపనీస్ వంటకాలు.. 100 మంది అతిథులు.. రష్మిక, విజయ్ పెళ్లిలో ప్రత్యేకతలు ఇవే..
Vijay Deverakonda, Rashmika Mandanna

Updated on: Feb 24, 2026 | 4:38 PM

ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. దక్షిణాదిలో ఇన్నాళ్లు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టకుండా ఉన్న రష్మిక, విజయ్ ఇటీవల తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. రష్మిక, విజయ్ వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉన్న ఐటీసీ హోటల్లో గ్రాండ్ గా జరగనుంది. వారి వివాహ వేదిక వద్ద మూడు అంచెల భద్రతను మోహరించినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, అంతర్జాతీయ భద్రతా మధ్య ఈ వేడుక జరగనుంది. తమ పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని గోప్యంగా ఉంచాలని వీరిద్దరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆరావళి కొండల మధ్య ఉన్న ‘ది మెమెంటోస్’ (ఐటిసి హోటల్స్) లో ఈ వేడుక జరగనుంది. తమ వివాహనికి విరోష్ అని పేరు పెట్టినట్లుగా ఇటీవల విజయ్, రష్మిక ప్రకటించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

అయితే మంగళవారం (ఫిబ్రవరి 24) నుంచి వీరిద్దరి వివాహ వేడుకలు ప్రారంభమైనట్లు సమాచారం. మంగళవారం మెహందీ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రైవేట్ కానీ రాయల్ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లకు కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు హాజరవుతారు. అలాగే వీరి వివాహనికి వచ్చే వివాహానికి వచ్చే అతిథులను కొబ్బరి నీళ్లతో స్వాగతించనున్నారు. అలాగే ఈ పెళ్లి వేడుకలలో జపనీస్ వంటకాలను సైతం సిద్ధం చేయనున్నారట.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

నివేదికల ప్రకారం, వివాహ వేడుకల సమయంలో పూర్తి గోప్యతను నిర్ధారించడానికి కఠినమైన “నో-ఫోన్ విధానం” అమలు చేయనున్నారట. వివాహానికి కేవలం 100 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారని సమాచారం. అతిథులు, సన్నిహితుల కోసం మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us